Skip to main content

DPS/DAE Recruitment 2023: జూనియర్‌ పర్జేజ్‌ అసిస్టెంట్‌/జూనియర్‌ స్టోర్‌ కీపర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల..

ముంబయిలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ పర్జేజ్‌ అండ్‌ స్టోర్స్‌.. జూనియర్‌ పర్జేజ్‌ అసిస్టెంట్‌/జూనియర్‌ స్టోర్‌ కీపర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ముంబయితోపాటు దేశవ్యాప్తంగా ఉన్న డీపీఎస్‌ యూనిట్లలో ఉద్యోగులను నియమించనున్నారు.
DPS-DAE Recruitment 2023

మొత్తం పోస్టులు: 65(రిజర్వేషన్ల వారీగా: ఎస్సీ–23, ఓబీసీలకు–08, ఈడబ్ల్యూఎస్‌–22, అన్‌రిజర్వ్‌డ్‌ అభ్యర్థులకు 12 కేటాయించారు)
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఎస్సీ/బీకాం/డిప్లొమా(మెకానికల్‌ ఇంజనీరింగ్‌ /ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రానిక్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి. గడువుతేదీ నాటికి సంబంధిత విద్యార్హతలు లేనివాళ్లు దరఖాస్తు చేసుకోవడానికి  అనర్హులు. 
వయసు: అభ్యర్థులకు 18–27ఏళ్ల మధ్య వయసు ఉండాలి. గరిష్ట వయసులో ఎస్సీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు 10–15ఏళ్లు, ఎక్స్‌–సర్వీస్‌మెన్‌లకు 3ఏళ్ల మినహాయింపు ఉంటుంది.

శిక్షణ, స్టయిపెండ్‌
రాత పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు ఉంటాయి. ఇందులో అర్హత పొందిన వారికి 6 నెలల శిక్షణకు ఎంపిక చేస్తారు. ఈ సమయంలో ప్రతినెలా రూ.18000 స్టైపెండ్, బుక్‌ అలవెన్స్‌ కింద ఒకేసారి రూ.3000 చెల్లిస్తారు. శిక్షణ పూర్తిచేసినవారిని జూనియర్‌ పర్చేజ్‌ అసిస్టెంట్‌/జూనియర్‌ స్టోర్‌ కీపర్‌గా నియమిస్తారు. ఎంపికైన అభ్యర్థులు మూడేళ్ల కాలానికి బాండ్‌ రాయాలి.

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 15.05.2023
  • ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ పరీక్షలు: జూన్‌ రెండో వారంలో

వెబ్‌సైట్‌: https://dae.gov.in/

చ‌ద‌వండి: CSIR-IICB Recruitment 2023: ఐఐఎస్‌బీ, కోల్‌కతాలో సైంటిస్ట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 15,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories