Skip to main content

ASRB Recruitment 2023: వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో 195 ఎస్‌ఎంఎస్, ఎస్‌టీవో పోస్టులు

న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్‌ సైంటిస్ట్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఏఎస్‌ఆర్‌బీ).. దేశవ్యాప్తంగా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు, వివిధ వ్యవసాయ, పశు, మత్స్య పరిశో«దనా కేంద్రాల్లో సబ్జెక్ట్‌ మేటర్‌ స్పెషలిస్ట్‌(ఎస్‌ఎంఎస్‌), సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌(ఎస్‌టీవో)పోస్టుల భర్తీతోపాటు జాతీయ అర్హత పరీక్ష(నెట్‌)-2023 నిర్వహణకు సంబంధించి ప్రకటనను విడుదలచేసింది.
ASRB Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 195
పోస్టుల వివరాలు: సబ్జెక్ట్‌ మేటర్‌ స్పెషలిస్ట్‌(ఎస్‌ఎంఎస్‌)-163, సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌(ఎస్‌టీవో)-32.
విభాగాలు: అగ్రికల్చరల్‌ బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్‌ ఎంటమాలజీ, అగ్రికల్చరల్‌ మైక్రోబయాలజీ, ఎకనామిక్‌ బోటనీ అండ్‌ ప్లాంట్‌ జెనెటిక్‌ రిసోర్సెస్, జెనెటిక్స్‌ అండ్‌ ప్లాంట్‌ బ్రీడింగ్, నెమటాలజీ, ప్లాంట్‌ బయోకెమిస్ట్రీ, ప్లాంట్‌ పాథాలజీ, ప్లాంట్‌ ఫిజియాలజీ, సీడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఆనిమల్‌ బయోటెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ సైన్స్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 10.04.2023 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నెట్‌కు సంబంధించి 01.01.2023 నాటికి అభ్యర్థి 21 ఏళ్ల నిండి ఉండాలి. దీనికి గరిష్ట వయోపరిమితి లేదు.
వేతనం: నెలకు ఎస్‌ఎంఎస్, ఎస్‌టీవో పోస్టులకు రూ.56,100 నుంచి రూ.1,77,500 ఉంటుంది. 
నెట్, ఎస్‌ఎంఎస్, ఎస్‌టీవో-2023 ఉత్తీర్ణత మార్కులు: యూఆర్‌ అభ్యర్థులకు 75.0(50%), ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ 67.5(45%), ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు 60.0(40%).

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 22.03.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.04.2023.
ఆన్‌లైన్‌ పరీక్ష తేది: 26.04.2023 నుంచి 30.04.2023 వరకు 

వెబ్‌సైట్‌: https://www.asrb.org.in/

చ‌ద‌వండి: CPCB Recruitment 2023: సీపీసీబీ, ఢిల్లీలో 163 ఉద్యోగాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 10,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories