Railway Jobs: కొంకణ్ రైల్వేలో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు.. అర్హతలు ఇవే..
కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (కేఆర్‌సీఎల్).. వివిధ విభాగాల్లో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 139
ఖాళీల వివరాలు: డిప్లొమా అప్రెంటిస్–52, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్–87.
డిప్లొమా అప్రెంటిస్:
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్;
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020, 2021లలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
వయసు: 01.10.2021 నాటికి 18–25ఏళ్ల మధ్య ఉండాలి.
స్టయిపెండ్: నెలకు రూ.3542 చెల్లిస్తారు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్:
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్, మెకానికల్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో నాలుగేళ్ల ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.10.2021 నాటికి 18–25 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టయిపెండ్: నెలకు రూ.4984 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 22.11.2021
వెబ్‌సైట్: https://konkanrailway.com
చదవండి: Railway Jobs: ఆర్‌ఆర్‌సీ–ఎన్‌సీఆర్‌లో 1664 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Qualification | DIPLOMA |
Last Date | November 22,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |