Skip to main content

BEL Recruitment 2023: బెల్‌లో 232 ఇంజనీర్‌ పోస్టులు.. రాత పరీక్ష ఇలా..

దేశ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన నవరత్న సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌)..ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 232 పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టనుంది. సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, బీఎస్సీ, పీజీ తదితర విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ ఆధారిత రాతపరీ­క్ష,ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Apply for BEL Jobs, 232 Vacancies at Bharat Electronics Limited, Qualifications: BE/BTech, BSc, PG, and More, Selection Process: Computer-Based Test and Interview, Engineering Jobs in BEL, BEL Recruitment Notification for 232 Posts,Ministry of National Defence Jobs

232 పోస్టులు: మొత్తం 232 ఉద్యోగాల్లో.. ప్రొబేషనరీ ఇంజనీర్‌-205, ప్రొబేషనరీ ఆఫీసర్‌ (హెచ్‌ఆర్‌)-12 పోస్టులు, ప్రొబేషనరీ అకౌంట్స్‌ ఆఫీసర్‌-15 పోస్టులు ఉన్నాయి. 
అర్హతలు: పోస్టులను అనుసరించి బీఈ/బీటెక్‌ /ఎమ్మెస్సీ(ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ /మెకానికల్‌/కంప్యూటర్‌ సైన్స్‌),ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ/పీజీ/పీజీ డిప్లొమా (హ్యూమన్‌ రిసోర్సెస్‌ మేనేజ్‌మెంట్‌/ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌/పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌), సీఏ/సీఎంఏ ఫైనల్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.09.2023 నాటికి ప్రొబేషనరీ ఇంజనీర్‌ పోస్టులకు 25 ఏళ్లు, ప్రొబేషనరీ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఈ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికైన వారిని  ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.

రాత పరీక్ష ఇలా: ఈ పరీక్షను ఆన్‌లైన్‌ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) విధానంలో నిర్వహిస్తారు.ఆబ్జెక్టి­వ్‌ పద్ధతిలో ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో ఆయా పోస్టులను అనుసరించి ఇంజనీరింగ్‌/హెచ్‌ఆర్‌/ఫైనాన్స్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలుంటాయి. 

కనీస అర్హత మార్కులు: జనరల్‌/ఓబీసీ(ఎన్‌సీఎల్‌)/ఈడబ్ల్యూఎస్‌ అండ్‌ ఈఎస్‌ఎం అభ్యర్థులు. సీబీటీ పరీక్షల్లో కనీసం 35 శాతం అర్హత మార్కులను సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ/పీడబ్ల్యూబీడీ వారు 30 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. పరీక్షలో అర్హత సాధించిన వారిని 1:5నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు షార్ట్‌లిస్ట్‌ చేస్తారు.

సర్వీస్‌ అగ్రిమెంట్‌: ఎంపికైన వారికి 6 నెలల పాటు శిక్షణ ఇస్తారు.శిక్షణ అనంతరం మూడేళ్లపాటు  బెల్‌ కు సంబంధించి ఏ యూనిట్‌లో అయినా పని చేసేందుకు సిద్ధమని తెలుపుతూ రూ.3లక్షల సర్వీ­స్‌ కాంట్రాక్ట్‌ బాండ్‌ సమర్పించాల్సి ఉంటుంది.

పోస్టింగ్‌ ప్రాంతాలు: బెంగళూరు, ఘజియాబాద్, పుణె, హైదరాబాద్, చెన్నై, మచిలీపట్నం, పంచకుల, కోట్‌ద్వారా, నవీ ముంబయి.

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 28.10.2023
  • కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేదీ: డిసెంబర్,2023
  • వెబ్‌సైట్‌: https://bel-india.in/

 

చ‌ద‌వండి: BHEL Recruitment 2023: బీహెచ్‌ఈఎల్, బెంగళూరులో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 28,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories