Management Trainee Jobs: కోల్ ఇండియాలో 481 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
Sakshi Education
కోల్‌కతా ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వశాఖకు చెందిన మహారత్న సంస్థ..కోల్ ఇండియా లిమిటెడ్(సీఐఎల్) పలు ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా మొత్తం 481 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. పూర్తి వివరాలు..
మొత్తం 481 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- మొత్తం పోస్టుల సంఖ్య: మేనేజ్‌మెంట్ ట్రెయినీ –481.
- రిజర్వేషన్ల వారీగా.. జనరల్–213, ఈడబ్ల్యూఎస్‌లకు–47, ఎస్టీలకు–65, ఎస్టీలకు–34, ఓబీసీలకు (ఎన్‌సీఎల్)–122 కేటాయించారు.
విభాగాల వారీగా ఖాళీలు
- పర్సనల్ అండ్ హెచ్‌ఆర్: ఈ విభాగంలో మొత్తం 138 ఖాళీలు ఉన్నాయి. ఇందులో జనరల్–60, ఈడబ్ల్యూఎస్–14, ఎస్సీ–20, ఎస్టీ–08, ఓబీసీ(ఎన్‌సీఎల్)–36.
- ఎన్విరాన్‌మెంట్: ఈ విభాగంలో 68 ఖాళీలున్నాయి. వీటికి సంబంధించి జనరల్–30, డబ్ల్యూఎస్–07, ఎస్సీ–10, ఎస్టీ–05, ఓబీసీ (ఎన్‌సీఎల్)–16.
- మెటీరియల్స్ మేనేజ్‌మెంట్: ఇందులో మొత్తం 115 ఖాళీలు ఉన్నాయి. జనరల్–53, డబ్ల్యూఎస్–11, ఎస్సీ–14, ఎస్టీ–08, ఓబీసీ (ఎన్‌సీఎల్)–03.
- మార్కెటింగ్ అండ్ సేల్స్: ఈ విభాగంలో 17 పోస్టులున్నాయి. ఇందులో జనరల్–10, ఈడబ్ల్యూఎస్–02, ఎస్సీ–02, (ఎన్‌సీఎల్)–03.
- కమ్యూనిటీ డెవలప్‌మెంట్: ఈ విభాగానికి సంబంధించి మొత్తం 79 ఖాళీలున్నాయి. జనరల్–33, ఈడబ్ల్యూఎస్–08, ఎస్సీ–11, ఎస్టీ–06, ఓబీసీ (ఎన్‌సీఎల్)–21.
- లీగల్: ఈ విభాగంలో 54 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జనరల్–21, ఈడబ్ల్యూఎస్–05, ఎస్సీ–08, ఎస్టీ–06, ఓబీసీ (ఎన్‌సీఎల్)–14.
- పబ్లిక్ రిలేషన్స్: ఈ పోస్టులకు సంబంధించి 6 ఖాళీలున్నాయి. జనరల్–03, ఎస్టీ–01, ఓబీసీ (ఎన్‌సీఎల్)–02.
- కంపెనీ సెక్రటరీ: ఇందులో 4 ఖాళీలు ఉన్నాయి. ఇందులో జనరల్–03, ఓబీసీ (ఎన్‌సీఎల్)–01.
చదవండి: ONGC Recruitment 2022: ఓపీఏఎల్, వడోదరలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే
అర్హతలు
- సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ఇంజనీరింగ్ డిగ్రీ/పీజీ/పీజీ డిప్లొమా/ఎంబీఏ పూర్తిచేసుకున్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.
వయసు
- జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మే 31, 2022 నాటికి వయసు 30ఏళ్లకు మించి ఉండకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. పీడబ్ల్యూడీ : జనరల్ 10, ఓబీసీ–13 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 15 ఏళ్లు అదనపు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక ఇలా
- అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది. పరీక్ష సమయం 3 గంటలు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో పరీక్ష రాసుకోవచ్చు. రెండు పేపర్లుగా(పేపర్–1, పేపర్–2) మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నపత్రం ఉంటుంది. ఒక్కో పేపరు 100 మార్కులకు ఉంటుంది. పేపర్–1 సంబంధించి జనరల్ నాలెడ్జ్/అవేర్‌నెస్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లిష్ ఉంటాయి. పేపర్–2 ప్రొఫెషనల్ నాలెడ్జ్ (సంబంధిత సబ్జెక్టుల్లో సంబం«ధించిన) విభాగం నుంచి ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కును కేటాయిస్తారు. నెగిటివ్ మార్కులులేవు.
- క్వాలిఫయింగ్ మార్కులు: జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ప్రతి పేపర్‌లోనూ 40 మార్కులు సాధించాలి. ఓబీసీ(నాన్ క్రీమీలేయర్) అభ్యర్థులు ప్రతి పేపర్‌లోనూ 35 మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 30 మార్కులు రావాలి.
- తుది ఎంపిక: డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు.
పరీక్ష కేంద్రాలు
- ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో తెలియజేసిన పరీక్ష కేంద్రాలకు సంబంధించిన జాబితా ఉంటుంది. అందులో మూడు ప్రాధాన్యత కేంద్రాలను ఎంపిక చేసుకోవాలి. ఒకసారి పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత తిరిగి మార్పులకు అవకాశం ఉండదు.
- ఆన్‌లైన్(సీబీటీ) పరీక్షను ఏ తేదీన నిర్వహించేది ఈ–మెయిల్ ద్వారా పంపించే అడ్మిట్ కార్డ్‌లో తెలియజేస్తారు. సీబీటీలో అర్హత సాధించిన విద్యార్థులు పేర్ల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
ముఖ్యసమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: 07.08.2022
- వెబ్‌సైట్: https://www.coalindia.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 07,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |