Skip to main content

UPSC: ఇంట‌ర్ అర్హ‌త‌తో ఉచిత డిగ్రీతో పాటు కేంద్ర ఉద్యోగం... పూర్తి వివ‌రాలు ఇవే

ర‌క్ష‌ణ రంగంలో రాణించాల‌నే కాంక్ష ఉన్న విద్యార్థుల‌కు ఇదొక చ‌క్క‌టి అవ‌కాశం. త్రివిద ద‌ళాల్లో చేరి కెరియ‌ర్‌ను ప్రారంభించాల‌ను కునే విద్యార్థులకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ) ఒక వార‌ధిగా నిలుస్తోంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ)ల్లో ఖాళీల భ‌ర్తీకి ప్ర‌తీ సంవ‌త్స‌రం యూపీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తుంది.
Union Public Service Commission(UPSC)
Union Public Service Commission(UPSC)

ఇందులో భాగంగా 2023 సంవత్సరానికి సంబంధించి రెండో విడత నోటిఫికేషన్ వెలువడింది. కేవ‌లం ఆన్‌లైన్‌లో మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ప‌రీక్ష కూడా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వ‌హిస్తారు. 

ఖాళీలు: మొత్తం 395 ఖాళీలకు యూపీఎస్సీ ప్రకటన విడుద‌ల చేసింది. ఎన్‌డీఏలో 370 (ఆర్మీ-208, నేవీ-42, ఏయిర్‌ఫోర్స్- 120) ఉన్నాయి. నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) ఖాళీలు 25 ఉన్నాయి. 

upsc

➤☛ 291 గ్రేడ్‌ బీ ఆఫీసర్‌ పోస్టులు.. రాత పరీక్షలు, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక..

అర్హత: ఆర్మీ వింగ్ పోస్టులకు ఏదైనా గ్రూపులో ఇంటర్... ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ఇంట‌ర్ సెకండియ‌ర్ చదువుతున్నవారు కూడా అప్లై చేసుకోవ‌చ్చు. 

వయసు: ఈ పోస్టుల‌కు కేవ‌లం అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 02-01-2005 నుంచి 01-01-2008 మ‌ధ్య జ‌న్మించిన వారు అర్హులు. 

ఎంపిక విధానం: ఎంపిక రెండు దశల్లో ఉంటుంది. రాత పరీక్ష, ఇంటెలిజెన్స్- పర్సనాలిటీ టెస్ట్, ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టు ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష(ఆబ్జెక్టివ్‌)లో రెండు పేపర్లు ఉంటాయి. పేవర్-1 మ్యాథమేటిక్స్- 300 మార్కులు (రెండున్నర గంటలు), పేపర్-2 జనరల్ ఎబిలిటీ- 600 మార్కులు(రెండున్నర గంటలు). రాత పరీక్షలో అర్హత పొందిన వారికి ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్టులు నిర్వహిస్తారు. దీనికి 900 మార్కులు ఉంటాయి. ఇక్క‌డ‌ అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్ నిర్వహించి మెరిట్‌ ఆధారంగా తుది ఎంపికలు జరుగుతాయి. 

NDC

➤☛ టీఎస్‌ గురుకులాల్లో 9,231 పోస్టులు.. విజయం సాధించే మార్గాలు ఇవే..

కోర్సులు: అర్హ‌త‌ పరీక్షలో మెరిట్ సాధించిన వారినే డిగ్రీ కోర్సులకు ఎంపిక చేస్తారు. వీరు బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సుల్లో దేన్నైనా ఎంచుకుని, ఉచితంగా చ‌ద‌వ‌చ్చు. కోర్సు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు మిన‌హా మిగిలిన వారు రూ.100 ఫీజు చెల్లించి ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తు తేదీలు: 17-05-2023 నుంచి 06-06-2023. ద‌ర‌ఖాస్తు గ‌డువు పూర్తయిన త‌ర్వాత స‌వ‌ర‌ణ చేసుకునేందుకు వారం పాటు గ‌డువుంటుంది.

రాత పరీక్ష: 03-09-2023.

➤☛ 4374 Post in BARC Recruitment 2023: అర్హతలు, ఎంపిక విధానం ఇలా‌..

కోర్సులు ప్రారంభం: 02-06-2024.

పరీక్ష కేంద్రాలు: అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్.

వివ‌రాల‌కు http://upsc.gov.in వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Published date : 17 May 2023 07:16PM
PDF

Photo Stories