AP Singh: వైమానిక దళాధిపతిగా ఏపీ సింగ్
Sakshi Education
భారత వైమానిక దళం (ఐఏఎఫ్) నూతన అధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ సెప్టెంబర్ 30వ తేదీ బాధ్యతలు స్వీకరించారు.
ఆయనకు 5 వేల గంటలకు పైగా యుద్ధ విమానాలను నడిపిన అనుభవముంది. 1964లో జన్మించిన అమర్ ప్రీత్ సింగ్ 1984లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్గా చేరారు. 40 ఏళ్ల సర్వీసులో కమాండ్, స్టాఫ్, ఇన్స్ట్రక్షనల్ విధులతోపాటు విదేశాల్లోనూ బాధ్య తలు నిర్వర్తించారు.
నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్, నేషనల్ డిఫెన్స్ కాలేజ్లలో చదివారు. ఫ్రంటైన్ ఎయిర్బోస్తోతోపాటు ఫైటర్ స్క్వాడ్రన్కు సారథ్యం వహించారు. పరమ్ విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్ అందుకున్నారు.
Published date : 01 Oct 2024 03:59PM