UPSC Exams 2023: నగరంలో ప్రశాంతంగా రక్షణశాఖ పరీక్షలు
సాక్షి ఎడ్యుకేషన్: యూపీఎస్సీ ఆధ్వర్యంలో రక్షణ శాఖకు చెందిన వివిధ పోస్టులకు నగరంలో నిర్వహించిన పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. రక్షణశాఖకు సంబంధించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ, కంబైన్డ్ డిఫైన్స్ సర్వీసెస్ విభాగాలకు చెందిన ప్రవేశాలకు ఈ పరీక్షలు నిర్వహించారు. నగరంలో వివిధ కేంద్రాల్లో ఆయా పరీక్షలను రాసేందుకు 1195 మంది అభ్యర్థులను కేటాయించారు.
బిషప్ అజరయ్య జూనియర్ కళాశాల ప్రాంగణంలో 373 మందిని కేటాయించగా 44 శాతం మంది, పీబీ సిద్ధార్థ కళాశాలలో 226 మందిని కేటాయించగా 40.26 శాతం మంది, కేబీఎన్ కళాశాల సెంటర్–ఏలో 373 మంది, సెంటర్–బీలో 223 మందిని కేటాయించగా సుమారు 50 శాతం హాజరయ్యారు. ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకూ, మధ్యాహ్నం 12 నుంచి రెండు గంటల వరకూ, మూడు నుంచి ఐదు గంటల వరకూ పరీక్షలు జరిగాయి.
SERP Salaries: జీతాలు పెంచేందుకు జీవో విడుదల
కలెక్టర్ ఢిల్లీరావు, ఆర్‌డీఓ మోహన్‌కుమార్ పరీక్షలను పర్యవేక్షించారు. వివిధ మండలాల తహసీల్దార్లు ఇన్‌చార్జిలుగా వ్యవహరించారు. స్థానిక పోలీసస్టేషన్లకు చెందిన సీఐల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.