Skip to main content

SERP Salaries: జీతాలు పెంచేందుకు జీవో విడుద‌ల‌

సెర్ప్ ఉద్యోగులు విశేషంగా కృషి చేస్తుండ‌డంతో, వైఎస్ఆర్సీపీ ప్ర‌భుత్వం ఈ ఉద్యోగుల జీతాల్ని పెంచాల‌నే నిర్ణ‌యం తీసుకొని జీవో విడుద‌ల చేసింది. దీనికి సంబంధించి మ‌రిన్ని వివరాలు...
Rural employees,government increases SERP  salaries announcement ,YSRCP government's decision
government increases serp salaries announcement

సాక్షి ఎడ్యుకేష‌న్: జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ (డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో పని చేసే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచింది. సెర్ప్‌ పరిధిలోని వైఎస్సార్‌ క్రాంతి పథంలో పని చేసే ఉద్యోగులు స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)ల ఉన్నతికి విశేషంగా కృషి చేస్తున్నారు.

Physical Education Jobs 2023: ఫిజికల్‌ ఎడ్యుకేషన్ పొందిన వారికి ఉద్యోగాలు...

రాష్ట్రంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వీరి జీతాలు పెంచుతూ జీవో 64ను విడుదల చేసింది. బేసిక్‌ జీతంపై ఏకంగా 23 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఈ జీతం ఆగస్టు ఒకటి నుంచి వర్తింపజేస్తున్నట్లు జీవోలో పేర్కొంది. దీంతో సెప్టెంబర్‌లో వచ్చే జీతం పెరుగుతుండడటంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Published date : 04 Sep 2023 03:23PM

Photo Stories