Skip to main content

Beauty Therapy Training: బ్యూటీ థెరపీలో శిక్షణ

Andhra Pradesh State Skill Development Institute  Training session for youth in Ongolu Town  Beauty Therapy Training  Training session for youth in Ongolu Town
Beauty Therapy Training

ఒంగోలు టౌన్‌: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు అసిస్టెంట్‌ బ్యూటీ థెరపిస్ట్‌, డొమెస్టిక్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కోర్సుల్లో మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జె. రవితేజ యాదవ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

పదో తరగతి పాస్‌ లేదా ఫెయిల్‌ అయిన ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 8వ తేదీ లోపు ప్రభుత్వ బాలికల ఐటీఐ కళాశాలలోని స్కిల్‌ హబ్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించారు. శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 7842004344కు ఫోన్‌ ద్వారా సంప్రదించాల్సిందిగా కోరారు.

Published date : 06 Jul 2024 08:52AM

Photo Stories