Skip to main content

MBBS Seat in TS : 12 లక్షల ర్యాంక్‌.. అయినా ఎంబీబీఎస్‌ సీటు.. ఎలా అంటే ఇలా..? రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా.. 

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎంబీబీఎస్ సీట్ల విష‌యంలో జ‌రిగే మాయాజాలం ఎవ‌రికి అర్ధం కాదు. ఏ ర్యాంక్ వారి ఎలా.. ఎక్క‌డ‌ సీటు వ‌స్తుంది ఇప్ప‌టికి కూడా క్లారిటి ఉండ‌దు. అప్ప‌టి అప్ప‌టికే లెక్క‌లు మారుతుంటాయి. అడ్డగోలు ఫీజులు ఉండటంతో.. 700 సీట్లు అందుబాటులో ఉన్నా.. 330 మంది మాత్రమే వాటికి ఆప్షన్‌ పెట్టుకున్నారు.
MBBS Seats News in Telugu News, MBBS seats mystery continues, uncertainty in allotment & ranks,
MBBS Seats In Telangana

చివరివరకు కన్వినర్, బీ కేటగిరీ సీట్ల కోసం ప్రయత్నించి.. వాటిలో రానివారు మున్ముందు ఎన్నారై కోటా కింద చేరే అవకాశాలు ఉంటాన్నాయ్‌. ఎక్కువ ఖర్చు చేసి ఇక్కడ ఎన్నారై కోటాలో ఎంబీబీఎస్‌ చేసే బదులు.. ఇతర రాష్ట్రాల్లో డీమ్డ్‌ వర్సిటీల్లో తక్కువ ఫీజుతో చదువుకోవచ్చన్న భావన కూడా ఉందని అంటున్నాయి.

☛ NEET Ranker Success Stories : ఒకే ఇంట్లో ముగ్గురికి మెడికల్‌ సీట్లు.. కార‌ణం ఇదే..

12 లక్షల నీట్‌ ర్యాంకర్‌ వరకు సీట్లు..
తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లోని మేనేజ్‌మెంట్‌ సీట్లకు జరిగిన తొలివిడత కౌన్సెలింగ్‌లో.. ఎన్నారై కోటా (సీ కేటగిరీ)లో గరిష్టంగా 12 లక్షల నీట్‌ ర్యాంకర్‌ వరకు సీట్లు లభించాయి. అదే బీ కేటగిరీలో 5.39 లక్షల ర్యాంకర్‌ వరకు సీట్లు వచ్చాయి. తదుపరి జరగనున్న రెండో, మూడో విడత కౌన్సెలింగ్‌లలో ఈ ర్యాంకులు మరింత పెరిగే అవకాశం ఉందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెప్తున్నాయి.

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా.. 

mbbs students in ts

ఎంబీబీఎస్‌ బీ, సీ కేటగిరీల తొలివిడత కౌన్సిలింగ్‌లో సీట్ల కేటాయింపు జాబితాను వర్సిటీ ఇటీవ‌లే ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా కన్వీనర్‌ కోటా కింద నీట్‌లో 2.38 లక్షల ర్యాంకు వచ్చిన ఓ విద్యార్థికి ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో కన్వినర్‌ కోటా సీటు లభించిన సంగతి తెలిసిందే. కన్వీనర్‌ కోటాకు సంబంధించిన రెండో విడత కౌన్సెలింగ్‌ సీట్ల కేటాయింపు జాబితాను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. అందులో రిజర్వేషన్‌ కేటగిరీల్లో ఇంకా పెద్ద ర్యాంకుకు కూడా సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

☛ NEET 2023 Rankers: నీట్‌లో అద‌ర‌గొట్టిన‌ గొర్రెల కాప‌ర్ల కూతుర్లు... పూరి గుడిసెలో ఉంటూ.. కోచింగ్‌కు డ‌బ్బులు లేక‌పోవ‌డంతో...
 
ఈ సీట్లపై అనాసక్తి.. కార‌ణం ఇదే.. 
రాష్ట్రంలో వైద్య విద్య అవకాశాలు భారీగా పెరిగాయి. 2023–24లో 56 మెడికల్‌ కాలేజీల్లో 8,490 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 27 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 3,790 ఎంబీబీఎస్‌ సీట్లు, 29 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50శాతం సీట్లను కన్వినర్‌ కోటా కింద భర్తీ చేస్తారు. ప్రైవేటులో మిగిలినవాటిలో బీ కేటగిరీ కింద 1,640 సీట్లను, ఎన్నారై కోటాలో 700 సీట్లను భర్తీ చేస్తారు. బీ కేటగిరీలో 85శాతం సీట్లను స్థానిక విద్యార్థులకే కేటాయిస్తుండటంతో మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశాలు మెరుగయ్యాయి. ఇక ఎన్నారై కోటాలో సీట్లు ఎక్కువగానే ఉన్నా.. వాటికి ఫీజులు బీ కేటగిరీ ఫీజుల కంటే రెట్టింపుగా ఉంటాయి. అంటే ఎన్నారై కోటా సీటు ఫీజు ఏడాదికి రూ.23 లక్షలు, అంతకుమించి ఉంటుంది. కాలేజీలను బట్టి ఇది మారుతుంది.

అడ్డగోలు ఫీజులు ఉండటంతో..

mbbs students news telugu

ఇలా అడ్డగోలు ఫీజులు ఉండటంతో.. 700 సీట్లు అందుబాటులో ఉన్నా.. 330 మంది మాత్రమే వాటికి ఆప్షన్‌ పెట్టుకున్నారు. చివరివరకు కన్వినర్, బీ కేటగిరీ సీట్ల కోసం ప్రయత్నించి.. వాటిలో రానివారు మున్ముందు ఎన్నారై కోటా కింద చేరే అవకాశాలు ఉంటాయని వైద్యవిద్య వర్గాలు చెప్తున్నాయి. ఎక్కువ ఖర్చు చేసి ఇక్కడ ఎన్నారై కోటాలో ఎంబీబీఎస్‌ చేసే బదులు.. ఇతర రాష్ట్రాల్లో డీమ్డ్‌ వర్సిటీల్లో తక్కువ ఫీజుతో చదువుకోవచ్చన్న భావన కూడా ఉందని అంటున్నాయి.

☛ NEET 2023 Ranker Inspirational Story : 11 ఏళ్ల‌కే పెళ్లి... 20 ఏళ్ల‌కు పాప... ఐదో ప్ర‌య‌త్నంలో నీట్ ర్యాంకు సాధించిన రాంలాల్ ఇన్‌స్పిరేష‌న‌ల్‌ స్టోరీ

కొత్త‌గా తొమ్మిది మెడికల్‌ కాలేజీలు ప్రారంభం..
ఇప్పటికే ఎంబీబీఎస్, పీజీలలో కన్వినర్‌ కోటా, మేనేజ్‌మెంట్‌ కోటాలకు తొలి విడత కౌన్సెలింగ్‌లు పూర్తిచేసి విద్యార్థులకు సీట్లు కేటాయించారు. దీంతో తరగతులు ప్రారంభించాలని ఎన్‌ఎంసీ ఆదేశించిన నేపథ్యంలో అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్టు కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రభుత్వ ఆధ్వర్యంలో తొమ్మిది మెడికల్‌ కాలేజీలు ప్రారంభం అవుతున్నాయి. కొమురంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, జనగాం, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్‌లలోని ఈ కాలేజీల్లోనూ శుక్రవారం నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి.

☛ Ritika : పెళ్లి కోసం దాచిన నగలు అమ్మి చదివింది..కట్ చేస్తే ఆల్ ఇండియా ర్యాంకు..

Published date : 04 Sep 2023 02:46PM

Photo Stories