First Muslim Female Fighter Pilot sonia: టీవీ మెకానిక్ కూతురు... తొలి ముస్లిం ఫైటర్ పైలట్
వెనకబడిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లా జాసోవర్ గ్రామానికి చెందిన ఓ చిన్న టీవీ మెకానిక్ కుతురు సానియా. పల్లెటూరిలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి నేడు ఎన్‌డీఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి తమ గ్రామాన్ని దేశవ్యాప్తంగా మార్మోగేలా చేస్తోంది.
చదవండి: ఎనిమిదో తరగతికే పెళ్లి... ఇప్పుడు ఆ యువతి ఏం సాధించిందో తెలుసా....
నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ) 2022 పరీక్షలో సానియా మీర్జా ఉత్తీర్ణత సాధించింది. 149వ ర్యాంకుతో సత్తా చాటింది. హిందీ మీడియంలో చదివినా విజయం సాధించవచ్చని నిరూపించింది సానియా. దీంతో ఆమె భారత్‌లోనే తొలి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్‌గా కానున్నట్లు భారత వైమానిక దళం(ఐఏఎఫ్) పేర్కొంది. ఆమె ఫైటర్ పైలట్‌గా ఎంపికవ్వడానికి ముందుగా నాలుగేళ్ల శిక్షణను విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
చదవండి: పాలు, పెరుగు అమ్ముతూ కోట్లు సంపాదిస్తోన్న బామ...
ఎన్‌డీఏలో మొత్తం 400 సీట్లు ఉంటాయి. ఇందులో 19 సీట్లు లేడీస్‌కు రిజర్వ్‌డ్ చేసి ఉంచుతారు. పైలట్ కావాలనుకునే ప్రతీ ఒక్కరి టార్గెట్ ఎన్‌డీఏ. ఇక్కడ సీటు వస్తే ఎయిర్‌ఫోర్స్‌లో చేరి దేశానికి సేవలందించే అవకాశం దొరుకుతుంది. డిసెంబర్ 27న ఆమె పూణెలోని ఎన్‌డీఏ అకాడమీలో శిక్షణ తీసుకోనుంది. ఈ సందర్భంగా వైమానిక దళం ఆమె కల నిజమవ్వాలంటూ.. సానియాకు శుభాకాంక్షలు తెలిపింది.
చదవండి: ‘పది’ పూర్తయి ఉంటేనే పేస్కేల్... వీఆర్‌ఏలకు ఇది శరాఘాతమే.?
సానియా మాట్లాడుతూ... తాను తొలి మహిళా పైలట్ అవనీ చతుర్వేదిని చూసి ప్రేరణ పొంది రెండో ప్రయత్నంలో ఎన్‌డీఏలో విజయం సాధించానన్నారు. శిక్షణ పూర్తి చేసి ఫైటర్ పైలట్‌గా ఎంపికయ్యాక తనను చూసి కూడా మరింత మంది స్ఫూర్తి పొందాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే సానియా విద్యాభ్యాసం అంతా జాసోవర్‌లోనే సాగింది. పదో తరగతి వరకు చింతామణి దూబె పాఠశాలలో... 12వ తరగతి గురునానన్ గర్ల్స్ ఇంటర్ కాలేజీలో పూర్తి చేసింది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేస్తే తొలి ముస్లిం ఫైటర్ పైలట్‌గా సానియా చరిత్ర పుస్తకాలకు ఎక్కనుంది.