Success Story: పాలు, పెరుగు అమ్ముతూ... కోట్లు సంపాదిస్తోన్న బామ
62 ఏళ్ల వయసులో పాలు, పెరుగు విక్రయించి కోట్లు సంపాదిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది గుజరాత్‌కు చెందిన నావల్ బెన్ దాల్సాంగ్.
గుజరాత్ లోని బానాస్కాంత జిల్లాలో నాగానా గ్రామానికి చెందిన నావల్ బెన్ దాల్సాంగ్ భాయ్ చౌదరి వయసు 62 ఏళ్లు. ఇంట్లోనే పశువులను పెంచి వాటి నుంచి వచ్చే పాలతో వ్యాపారం చేసి కోటి రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తోంది. 2020లో నెలకు సుమారుగా రూ.8 నుంచి 9 లక్షలు చొప్పున మొత్తం ఏడాదికి కోటి రూపాయలు సంపాదించింది.
చదవండి: ఎనిమిదో తరగతికే పెళ్లి... ఇప్పుడు ఆ యువతి ఏం సాధించిందో తెలుసా....
నలుగురు పిల్లల తల్లి అయిన ఆమె 2019లో రూ.90 లక్షలు సంపాదించింది. 2020కి అది రూ. కోటికి పెరిగింది. గేదేలు, ఆవులను పోషించేందుకు, డైరీ నిర్వహణకు 15 మంది కూలీలను నియమించింది. నవాల్ బెన్ సంపాదన చూసి ఆ జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది డైరీలను ప్రారంభించడం మొదలు పెట్టారు. ఆమె ప్రయత్నాలకు ప్రతిఫలంగా బానాస్కాంత జిల్లాలో మూడుసార్లు ఉత్తమ పశుపాలక అవార్డును అందుకుంది. రెండు సార్లు ’లక్ష్మీ’ పురస్కారం కూడా అందుకుంది.
చదవండి: అమూల్ అంటే అర్థం తెలుసా... దీని చరిత్ర తప్పక తెలుసుకోవాల్సిందే
‘నేను 80 గేదేలు, 45 ఆవులతో డైరీ నడుపుతున్నా. వాటి ద్వారా వచ్చిన పాలను అమ్మి 2019లో రూ.90 లక్షలు సంపాదించా. ఈ పనిలో ఇంత మొత్తం సంపాదించడం మా జిల్లాలో నేనే మొదటి వ్యక్తిని. 2020లో కోటి 10 లక్షల రూపాయలను ఆర్జించా’ అని నవాల్ బెన్ గర్వంగా చెబుతారు. 2020 ఆగస్టులో ఈమె అముల్ సంస్థ ప్రకటించిన 10 మిలియన్లు సంపాదించిన టాప్10 రూరల్ ఉమన్ ఎంటర్ ప్రెన్యూర్ జాబితాలో చోటుదక్కించుకుంది.
చదవండి: కష్టాల కడలిలో ఈదుతూ.... సూపర్ సీఈఓగా ఎదిగిన అనిల్ ప్రస్థానం తెలుసా..
కరోనా సమయంలో ఎంతో మంది వ్యాపారస్తులు వ్యాపారం కోల్పోయి నష్టాలతో ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు చూశాం. అలాగే ఎంతో మంది ఉద్యోగాలు పోగుట్టుకుని రోడ్డున పడ్డారు. కొన్ని వేల మంది ఉద్యోగం, ఉపాధి లేక నిరాశ, నిస్పృహలతో బాధపడుతున్నారు. ఇలాంటి ఎన్నో వేల మందికి నవాల్ బెన్ జీవితం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. స్వయం ఉపాధితో పాటు, పది మందికి ఉపాధి కూడా కల్పిస్తున్న నవాల్ బెన్ ఎంతో మందికి ఆదర్శం అనడంలో సందేహం లేదు.