Sahara investors get Refund: సహారా పెట్టుబడిదారులకు గుడ్‌న్యూస్... ఈ టిప్స్‌ని పాటించి మీ డబ్బులు పొందండి..!
సహారా గ్రూప్ సంస్థ సెబీ వద్ద డిపాజిట్ చేసిన రూ.24,979 కోట్ల నుంచి రూ.5,000 కోట్లను సహారా గ్రూప్ కో-ఆపరేటివ్ సొసైటీస్ డిపాజిటర్లకు చెల్లించడానికి సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఈ మొత్తం సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్ సొసైటీస్ ఖాతాలో జమ అయ్యింది.
ఇవీ చదవండి: పది, డిప్లొమా అర్హతతో శ్రీహరికోటలో ఉద్యోగాలు... ఇలా అప్లై చేసుకోండి
సహారా గ్రూప్‌నకు చెందిన కోపరేటివ్ సొసైటీలు.. సహారా క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్, సహరాయణ్ యూనివర్సల్ మల్టీపర్పస్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్, హమారా ఇండియా క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్, స్టార్స్ మల్టీపర్పస్ కోపరేటివ్ సొసైటీలకు చెందిన మదుపరులకు ఈ మొత్తాలు చెల్లించనున్నారు.
రూ.10వేల వరకు డిపాజిట్లు చేసిన వారికి తొలి విడతలో చెల్లింపులు చేస్తున్నారు. తర్వాత క్రమంగా ఈ మొత్తాన్ని పెంచుకుంటూ వెళతారు. ఇలా రూ.5వేల కోట్లను వినియోగించిన తర్వాత మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించి.. తీర్పును అనుసరించి మిగిలిన వారికి చెల్లింపులు చేస్తారు.
ఇవీ చదవండి: ఆగని విద్యార్థుల ఆత్మహత్యలు... రెండు రోజుల్లో ఇద్దరు బలి... ఇప్పటివరకు 18 మంది సూసైడ్.. కోటాలో ఏం జరుగుతోంది.?
వీటిని పాటించి సహారా డబ్బుల్ని క్లయిమ్ చేసుకోండి
☛ ముందుగా mocrefund.crcs.gov.in. పోర్టల్‌కి వెళ్లాలి
☛ ఆధార్ కార్డ్ నంబర్‌తో డిపాజిటర్ లాగిన్ అవ్వాలి
☛ అనంతరం మీ వద్ద ఉన్న సహారా బాండ్ పేపర్లని, ఇతర పత్రాలని అప్‌లోడ్ చేయాలి.
ఇవీ చదవండి: నేడో, రేపో పీఆర్‌సీ ప్రకటన... తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ వరాలు..!
☛ అప్‌లోడ్ చేసిన పత్రాలని 30 రోజుల్లోగా ధ్రువీకరిస్తారు.
☛ అనంతరం 15 రోజుల్లో అధికారులు దీనిపై చర్యలు తీసుకుంటారు.
☛ తర్వాత ఎస్‌ఎంఎస్ ద్వారా వెరిఫికేషన్ పూర్తయినట్లు సమాచారం అందిస్తారు.
☛ ఎస్‌ఎంఎస్ వచ్చిందంటే మీ ఆన్‌లైన్ క్లెయిమ్ ఆమోదం పొందిందని అర్థం.
☛ తర్వాత పెట్టుబడి మొత్తం ఖాతాకు బదిలీ అవుతుంది.
☛ క్లెయిమ్‌ని ధ్రువీకరించిన తేదీ నుంచి 45 రోజుల్లో మొత్తం బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.