Kota: ఆగని విద్యార్థుల ఆత్మహత్యలు... రెండు రోజుల్లో ఇద్దరు బలి... ఇప్పటివరకు 18 మంది సూసైడ్.. కోటాలో ఏం జరుగుతోంది.?
సాక్షి, ఎడ్యుకేషన్: నీట్, జేఈఈ, సివిల్స్... ఇలా పోటీ పరీక్ష ఏదైనా కోచింగ్ సెంటర్లకు కోటా ప్రసిద్ధి. ప్రతీ ఏడాది ఇక్కడ సుమారు 3 లక్షల మంది విద్యార్థులు కోచింగ్ కోసం వస్తుంటారు. అయితే పోటీ పరీక్షల్లో సత్తాచాటేందుకు, ర్యాంకులు రాబట్టేందుకు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు విద్యార్థులను విపరీతంగా చదివిస్తూ ఉంటారు.
ఇవీ చదవండి: నేడో, రేపో పీఆర్‌సీ ప్రకటన... తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ వరాలు..!
ఈ ఒత్తిడిని తట్టుకోలేని విద్యార్థులు ప్రాణం తీసుకుంటున్నారు. గత ఎనిమిది నెలల్లో 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గురువారం(ఆగస్ట్ 3న) ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవకముందే ఈ రోజు మరో నీట్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు.
ఇవీ చదవండి: నిర్మాణరంగంలో భారీగా ఉద్యోగాలు... 2030నాటికి 10 కోట్ల ఉద్యోగాలు
వివిధ ఎంట్రెన్స్ టెస్టులు, పోటీపరీక్షల కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన ‘కోటా’లో.. పొరుగు రాష్ట్రాల నుంచి ఏటా లక్షల మంది విద్యార్థులు శిక్షణ పొందుతారు. ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది అక్కడ శిక్షణ తీసుకుంటున్నట్లు అంచనా. ఈ క్రమంలోనే అక్కడ విద్యార్థులు ఆత్మహత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఇవీ చదవండి: ఆగస్టు 17వ వరకు పోలీసు పరీక్ష ఫలితాలు లేనట్లే... కారణం ఏంటంటే...
గతేడాది 15 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడగా.. ఈ ఏడాది ఇప్పటికే ఆ సంఖ్య 18కి చేరడం కలవరపెడుతోంది. అంతకుముందు కూడా పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. వీటితోపాటు అనేక ఘటనల్లో విద్యార్థులు ఆత్మహత్యకు యత్నించిన సందర్భాలూ ఉన్నాయి. అయితే, ఒత్తిడితోనే ఇలా బలవన్మరణానికి పాల్పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.