Skip to main content

Construction Sector: నిర్మాణ‌రంగంలో భారీగా ఉద్యోగాలు... 2030నాటికి 10 కోట్ల ఉద్యోగాలు

దేశంలో రియ‌ల్ ఎస్టేట్ దూసుకెళుతోంది. ఇత‌ర రంగాలు ఊగిస‌లాడుతూ ఉండ‌గా నిర్మాణ‌రంగం మాత్రం స్థిరంగా వృద్ధిని న‌మోదుచేస్తోంది. ప్ర‌స్తుతం ఈ రంగంలో 7 కోట్ల ఉద్యోగాలు ఉన్నట్లు స్థిరాస్తి కన్సల్టింగ్‌ సేవల సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ తాజా నివేదికలో వెల్లడించింది.
Construction Sector
నిర్మాణ‌రంగంలో భారీగా ఉద్యోగాలు... 2030నాటికి 10 కోట్ల ఉద్యోగాలు

ఈ సంఖ్య ఈ ద‌శాబ్దం చివ‌రి నాటికి 10 కోట్ల‌కు చేరుకుంటుంద‌ని అంచ‌నావేసింది.

స్థిరాస్తి రంగ ఉత్పత్తి రూ.82 లక్షల కోట్లకు పెరుగుతుందని నైట్‌ ఫ్రాంక్  అంచనా వేసింది. ‘స్కిల్డ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఇన్‌ కన్‌స్ట్రక్షన్‌ సెక్టార్‌’ పేరిట, రాయల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ సర్వేయర్స్‌ (ఆర్‌ఐసీఎస్‌) ఇండియాతో కలిసి నైట్‌ ఫ్రాంక్ ఈ నివేదికను రూపొందించింది.

ఇవీ చ‌ద‌వండి: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 వాయిదా..? అభ్య‌ర్థుల ఆందోళ‌నకు కార‌ణం ఇదే..!

construction

ఇటీవ‌లే జ‌నాభాలో చైనాను అధిగ‌మించి భార‌త్ నంబ‌ర్ 1స్థానానికి చేరుకుంది. ఇదే నిర్మాణ‌రంగానికి ఊతంగా నిలుస్తోంది. జనాభా పెరుగుదల ప్ర‌భావం నివాస గృహాలపై ఉంటోంది. దీంతో నివాస గృహాలకు అధిక డిమాండ్ ఉంటోంది. అలాగే ఆఫీసు, రిటైల్‌, ఆతిథ్య, సరకు నిల్వ సదుపాయాల రంగాల నుంచి రియల్‌ ఎస్టేట్‌కు అధిక డిమాండ్ ఉంటోంద‌ని నివేదిక తెలిపింది.

ఇవీ చ‌ద‌వండి: ఆగస్టు 17వ వరకు పోలీసు ప‌రీక్ష ఫ‌లితాలు లేన‌ట్లే... కారణం ఏంటంటే...

construction

స్థిరాస్తి రంగంలోనూ అధిక నైపుణ్యం ఉన్న‌ సిబ్బందికి డిమాండ్‌ పెరుగుతోందని స్పష్టం చేసింది. గత దశాబ్దకాలంలో నిర్మాణ రంగం ప్ర‌తి ఏటా 11% వృద్ధి నమోదు చేసింది. దీనివల్ల దేశ‌ ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం వాటా 18 శాతానికి పెరిగింది. గత దశాబ్దకాలంలో ఈ రంగం సుమారు రూ.2.87 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది.

ఇవీ చ‌ద‌వండి: నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌... ఏపీలో 3,295 పోస్టుల భర్తీకి సీఎం జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్‌

Published date : 05 Aug 2023 12:32PM

Photo Stories