Skip to main content

Growth of Housing Market: కరోనా తరువాత మారిన పరిస్థితులు.. ఇళ్ల పెరుగుదరలు ఇలా!

నైట్‌ఫ్రాంక్‌కు చెందిన గ్లోబల్‌ హౌస్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ 56 దేశాల్లో స్థానిక కరెన్సీలో ఇళ్ల ధరల చలనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది. వార్షికంగా అత్యధికంగా తుర్కియేలో 89.2 శాతం మేర ఇళ్ల ధరలు పెరిగాయి.
Knight Frank's Global Index  14th Position of India from all over the world in Marketing of Houses

అంతర్జాతీయంగా ఇళ్ల ధరల పెరుగుదలలో భారత్‌ 14వ స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇళ్ల ధరలు 5.9 శాతం పెరిగినట్టు నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇళ్ల ధరల పెరుగుదల సూచీలో భారత్‌ 18 స్థానాలు ముందుకు వచ్చింది. నైట్‌ఫ్రాంక్‌కు చెందిన గ్లోబల్‌ హౌస్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ 56 దేశాల్లో స్థానిక కరెన్సీలో ఇళ్ల ధరల చలనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది. వార్షికంగా అత్యధికంగా తుర్కియేలో 89.2 శాతం మేర ఇళ్ల ధరలు పెరిగాయి.

Net Direct tax collections: ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.10.64 లక్షల కోట్లు

ఆ తర్వాత క్రొయేయాలో 13.7 శాతం, గ్రీస్‌లో 11.9 శాతం, కొలంబియాలో 11.2 శాతం, నార్త్‌ మెసడోనియాలో 11 శాతం చొప్పున పెరిగాయి. ‘‘అంతర్జాతీయంగా సెంట్రల్‌ బ్యాంక్‌లు అధిక వడ్డీ రేట్లతో ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఇళ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సగటున ఇళ్ల ధరల పెరుగుదల అంతర్జాతీయంగా 3.5 శాతంగా ఉంది. కరోనా ముందు పదేళ్ల వార్షిక సగటు పెరుగుదల 3.7 శాతానికి సమీపానికి చేరుకుంది’’ అని నైట్‌ఫ్రాంక్‌ తన తాజా నివేదికలో వివరించింది. నైట్‌ఫ్రాంక్‌ పరిశీలనలోని 56 దేశాలకు గాను 35 దేశాల్లో ఇళ్ల ధరలు గడిచిన ఏడాది కాలంలో పెరగ్గా, 21 దేశాల్లో తగ్గాయి.

16th Finance Commission: రాష్ట్రాల అసమానతలు పరిష్కరించే వ్య‌వ‌స్ధ ఏదంటే..

చెప్పుకోతగ్గ వృద్ధి

‘‘గృహ రుణాలపై అధిక రేట్లు, ద్రవ్యోల్బణం ముప్పు ఉన్నప్పటికీ భారత నివాస మార్కెట్‌ చెప్పుకోతగ్గ వృద్ధిని సాధించింది. స్థిరమైన ఆర్థిక వృద్ధి అంతిమంగా వినియోగదారుల ఆర్థిక భద్రతకు దారితీసింది. సొంతిల్లు కలిగి ఉండాలనే ఆకాంక్ష నివాస రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లో డిమాండ్‌ను నడిపిస్తోంది’’ అని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్‌ బైజాల్‌ తెలిపారు. పట్టణీకరణ పెరుగుతుండడం, మౌలిక సదుపాయాల వృద్ధికి అదనపు తోడ్పాటును అందిస్తోందని, పట్టణాల్లో ప్రముఖ నివాస ప్రాంతాలకు ఇది అనుకూలమని నైట్‌ఫ్రాంక్‌ పేర్కొంది.

Google Play Store: 2500 లోన్ యాప్స్‌ను డిలీట్ చేసిన గూగుల్.. నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన.. కారణం ఇదే..!

కరోనా తర్వాత ఇళ్లకు డిమాండ్‌ పెరిగినట్టు హైదరాబాద్‌కు చెందిన రియల్టీ సంస్థ పౌలోమీ ఎస్టేట్స్‌ ఎండీ ప్రశాంత్‌రావు పేర్కొన్నారు. ‘‘ఇళ్ల ధరల పెరుగుదలకు కొన్ని అంశాలు దారితీశాయి. గతంలో నిలిచిన డిమాండ్‌ తోడు కావడం, మెరుగైన వసతికి మారిపోవాలన్న ఆకాంక్ష, ఆధునిక వసతులతో కూడిన చక్కని ఇళ్లపై ఖర్చు చేసే ఆసక్తి ధరల పెరుగుదలకు అనుకూలించాయి. దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ధరల పెరుగుదలలో ఇతర మార్కెట్లతో పోలిస్తే హైదరాబాద్‌ ముందుంది’’అని ప్రశాంత్‌ రావు తెలిపారు.

Published date : 23 Dec 2023 12:22PM

Photo Stories