Modi-Trump: ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన..!

భారత ప్రధాని నరేంద మోదీ ఆక్రమ వలసదార్లను తిరిగి తీసుకొనే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అది సరైనదేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అక్రమ వలసదార్లపై భారత ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. జనవరి 29వ తేదీ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో శ్వేత సౌధాన్ని సందర్శించే అవకాశం ఉందని ట్రంప్ వెల్లడించారు. ఇండియాతో తన స్నేహ సంబంధాలు బలమైనవని ఆయన చెప్పారు.
ఫ్లోరిడా రీట్రీట్లో హౌస్ ఆఫ్ రిపబ్లికన్స్‌కు ఆయన ప్రసంగిస్తూ, అమెరికాకు నష్టం కలిగించే దేశాల ఉత్పత్తులపై అధిక సుంకాలు (టారిఫ్స్) విధించాలని మళ్లీ స్పష్టం చేశారు. చైనా, ఇండియా, బ్రెజిల్ వంటి దేశాలను ప్రస్తావిస్తూ, ఈ దేశాలు అమెరికా ఉత్పత్తులపై అధిక పన్నులు వసూలు చేస్తున్నాయని విమర్శించారు. ట్రంప్, అమెరికాకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
India-Indonesia: భారత్, ఇండోనేషియా మధ్య ద్వైపాక్షిక సంబందాలు
కొలంబియా నుంచి 25 శాతం టారిఫ్ విధించనున్నట్లు ఆయన హెచ్చరించారు. దీంతో, కొలంబియా ప్రభుత్వం వెంటనే అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న తమ పౌరులను తిరిగి తీసుకొచ్చే నిర్ణయం తీసుకుంది. అలాగే, కెనడా, మెక్సికో మీద కూడా టారిఫ్స్ విధించేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు.
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)