Telangana Govt: నేడో, రేపో పీఆర్‌సీ ప్రకటన... తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ వరాలు..!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ఉద్యోగులకు వరుస శుభవార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉద్యోగులను మచ్చిక చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఆగస్ట్ 3న అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ రాజేందర్, ప్రధాన కార్యదర్శి వి.మమత, టీజీవో ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ తదితరులు సీఎంను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఇవీ చదవండి: ఆగస్టు 17వ వరకు పోలీసు పరీక్ష ఫలితాలు లేనట్లే... కారణం ఏంటంటే...
ఇవీ చదవండి: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
రెండో పీఆర్‌సీని ఏర్పాటు చేసి, 2023 జులై 1 నుంచి అమలయ్యేలా ఐఆర్‌ను ప్రకటించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూడాలని సీఎంను కోరారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం తామిచ్చే చందాతో కూడిన ట్రస్టును ఏర్పాటుచేసి, మెరుగైన వైద్యసేవలు అందేలా ఈహెచ్‌ఎస్‌ను తీర్చిదిద్దాలని విన్నవించారు. సీపీఎస్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. శుక్ర, శనివారాల్లో ఏదో ఒక రోజు వేతన సవరణ కమిషన్, మధ్యంతర భృతిపై అసెంబ్లీలోనే ప్రకటిస్తామని సీఎం చెప్పినట్లుగా రాజేందర్ తెలిపారు.