Skip to main content

Cottage Industries: కుటీర పరిశ్రమలతో ఆర్థికాభివృద్ధి

Economic development with cottage industries

ములుగు రూరల్‌: కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సూచించారు. గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో పీఎంఈజీపీ పథకంలో భాగంగా రూ. 15 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన శానిటరీ న్యాపికిన్స్‌ యూనిట్‌ను బుధవారం కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడారు. అనంతరం కస్తూర్భా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. మహిళలకు, యువతులు రుతస్రావం సమయంలో పరిశుభ్రత పాటించాలన్నారు. పూర్తి ఆర్గానిక్‌ న్యాప్‌కిన్స్‌ను ఉపయోగించాలన్నారు. అనంతరం విద్యార్థినులకు న్యాప్‌కిన్స్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీపీఓ వెంకయ్య, డీడబ్ల్యూఓ ప్రేమలత, తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, ఎంపీడీఓ ప్రవీణ్‌, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Mega Job Mela: జాబ్‌మేళా పోస్టర్‌ విడుదల

Published date : 27 Jul 2023 03:36PM

Photo Stories