Skip to main content

Success Story: ఈ వంటలక్క ఆదాయం... కోటిపైనే ...

వంటలక్క ఈ పేరు తెలియన తెలుగు వారుండరు. కార్తీక దీపం సీరియల్‌లో వంటలక్క క్యారెక్టర్‌ సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. ఇలానే ముంబైకి చెందిన ఓ వంటలక్క తన పసందైన వంటలతో ఆకట్టుకుంటోంది.

ఏడాదిలో రూ.కోటి రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిమంతంగా నిలుస్తోంది. ఆమె సక్సెస్‌ జర్నీ సాగుతోందిలా... 

గీత... ముంబై మహానగరంలోని విలేపార్లే లోని ఓ సాధారణ గృహిణి. ఆమె భర్త గోవింద్‌ పాటిల్‌ ఓ డెంటల్‌ ల్యాబ్‌లో క్లర్క్‌గా పని చేసేవాడు. ఇద్దరు పిల్లలు వినీత్, దర్శన్‌ లు స్కూలుకు వెళ్తున్నారు. అయితే ఈ ఇద్దరు పిల్లల కారణంగా ప్రతీ రోజూ స్కూల్‌లో ఏదో ఒక గొడవ జరిగేది. పిల్లలకు రుచికరమైన వంటకాలు లంచ్‌బాక్స్‌లో సర్ధేది గీత. ఆ బాక్స్‌ షేర్‌ చేసుకుంటామంటూ వినీత్, దర్శన్‌ ఫ్రెండ్స్‌ ప్రతీ నిత్యం గొడవలు పడేవారు. ఒక్కోసారి వీళ్లకు మిగల్చకుండా తినే వాళ్లు కూడా.

vantalakka

గోవింద్‌ పాటిల్‌ ఉద్యోగం 2016లో  పోయింది. అప్పటికే  స్కూల్‌ ఎడ్యుకేషన్‌  పూర్తి చేసుకుని కాలేజ్‌లోకి ఎంటర్‌ అయ్యారు వినీత్, దర్శన్‌లు. ఇంటికి ఆధారంగా ఉన్న ఉద్యోగం పోవడం ఒక సమస్య అయితే పిల్లల చదువు ఖర్చులు పెరగడం మరో సమస్యగా మారిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో గీతాగోవింద్‌ దంపతులకు అదనపు ఆదాయ మార్గం చూసుకోవాల్సిన ఆగత్యం ఏర్పడింది.

చ‌ద‌వండి: ఎనిమిదో తరగతికే పెళ్లి... ఇప్పుడు ఆ యువతి ఏం సాధించిందో తెలుసా....

పిల్లల లంచ్‌ బాక్స్‌ కోసం వాళ్ల ఫ్రెండ్స్‌ చేసే గొడవ గుర్తొచ్చింది గీతకు. భర్త సైతం ఆమె ఆలోచనలకు మద్దతు పలికాడు. అంతే ఇంట్లో కిచెన్‌ లోనే స్నాక్స్‌ తయారు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే అవి అమ్ముడుపోతాయా ? వాటి మీద పెట్టే ఖర్చులు కనీసం వెనక్కి తిరిగి వస్తాయా అనే సందేహం వాళ్లను వదల్లేదు. దీంతో ముందుగా బహాన్‌  ముంబై స్థానిక కార్యాలయంలో ముందుగా టీ, స్నాక్స్‌ అందివ్వాలని నిర్ణయించుకున్నారు. అక్కడ కూడా ఈ వంటలకు మంచి పేరు రావడంతో కిచెన్‌ లోనే హోం ఫుడ్స్‌కు శ్రీకారం చుట్టింది గీతాగోవింద్‌ పాటిల్‌. 

చ‌ద‌వండి: టీవీ మెకానిక్‌ కూతురు... తొలి ముస్లిం ఫైటర్‌ పైలట్‌

మహారాష్ట్ర ప్రాంతపు పిండివంటలు, స్నాక్స్‌కు తనదైన రెసిపీనీ యాడ్‌ చేయడంతో గీత చేసే హోంఫుడ్స్‌కు ఆ ఏరియాలో ఫ్యాన్‌ బేస్‌ పెరిగింది. క్రమం తప్పకుండా ఆర్డర్లు రావడం మొదలైంది. దీంతో హోం డెలివరీ సర్వీసులు సైతం మొదలయ్యాయి. అలా రెండేళ్లు గడిచే సరికి గోవింద్‌ పాటిల్‌ మరో ఉద్యోగం వెతుక్కోవాల్సిన అవసరం లేకపోయింది.  

కరోనా కాలం కమ్మేసిన సమయంలో ముంబైలో అనేక మంది ఉన్న ఉపాధి కోల్పోయారు. గీత నివసించే ప్రాంతంలోనే ఎన్నో కుటుంబాలు ఆర్థిక ఆసరా కోసం ఎదురు చూడాల్సిన దుస్థితిలో పడ్డాయి. ఈ తరుణంలోనే వాళ్లందరికి అండగా నిలిచింది గీత. అయితే పడుతున్న కష్టానికి చేతిలో మిగులుతున్న సొమ్ముకు పొంతన కుదరడం లేదు. ఎంత కష్టపడ్డా ఏడాదికి పన్నెండు లక్షలు మించి ఆదాయం కనపడలేదు.

చ‌ద‌వండి: పాలు, పెరుగు అమ్ముతూ కోట్లు సంపాదిస్తోన్న బామ‌...

తన తల్లి చేస్తున్న వంటల్లో కమ్మదనం ఉన్నా వాటికి బ్రాండ్‌ ఇమేజ్‌ లేకపోవడం గమనించాడు వినీత్‌. వెంటనే తమ హోం ఫుడ్స్‌కి పాటిల్‌ కాకి అనే బ్రాండ్‌ను ఇచ్చాడు. ఫేస్‌బుక్, ఇన్‌ స్ట్రాగామ్‌ వేదికగా ప్రచారం నిర్వహించాడు. అంతే ఏడాది తిరిగే సరికి పాటిల్‌ కాకి స్వరూపమే మారిపోయింది. విల్లేపార్లేలోని చిన్న ఇంటిలో ఇరుకైన కిచెన్‌ నుంచి శాంతక్రాజ్‌ ఏరియాకు షిప్ట్‌ అయ్యింది పాటిల్‌ కాకి. మూడు వేల మందికి పైగా రెగ్యులర్‌ కస్టమర్‌ బేస్‌ రెడీ అయ్యింది. 25 మంది రెగ్యులర్‌ ఎంప్లాయిస్‌ వచ్చి చేరారు. కేవలం ఏడాది వ్యవధిలోనే పాటిల్‌ కాకి రెవెన్యూ పన్నెండు లక్షల నుంచి కోటి నలభై లక్షలకు చేరుకుంది.

Published date : 24 Dec 2022 04:17PM

Photo Stories