Skip to main content

CM KCR: 80 వేల ప్ర‌భుత్వ ఉద్యోగాల భర్తీకి కీల‌క ప్ర‌క‌ట‌న‌..భ‌ర్తీ ప్ర‌క్రియ ఎప్పుడంటే..?

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదిక‌గా ఉద్యోగాల‌ భ‌ర్తీపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

రానున్న 2, 3 నెల‌ల్లో ఉద్యోగ నియామ‌క ప్ర‌క్రియ ప్రారంభం అవుతుంద‌ని తెలిపారు. 80వేల ప్ర‌భుత్వ‌ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించారు.

95శాతం ఉద్యోగాలు స్థానికులకే..
ఇప్పటి వ‌ర‌కు 1.35లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామ‌ని, కొత్త జోన్ల  విధానం ప్ర‌కారం 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా నిబంధన పెట్టాం తెలిపారు. ఇప్పుడున్న ఉద్యోగుల‌ను ఎవ‌రి జోన్ల‌కు వారి పంపిన త‌ర్వాత‌..ఏర్పడిన ఖాళీల‌తో క‌లిపి మెత్తం ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు.

టీఎస్‌పీఎస్సీ ప‌రీక్ష‌ల స్ట‌డీమెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్ పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, జీకే, క‌రెంట్ అఫైర్స్ మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

Published date : 05 Oct 2021 05:27PM

Photo Stories