Skip to main content

Snap Layoffs: ఉద్యోగుల తొలగింపునకు సిద్దం.. ఈ కంపెనీ ఉద్యోగుల‌ను తొలగించడం ఇది మొదటిసారి కాదు..!

ఈ సంవ‌త్స‌రం ప్రారంభం నుంచి అనేక దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి.
Snap Company Announced To Layoff 10% Workforce

ఈ ఏడాది ఇప్పటికే 32,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్‌‌స్టంట్ మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్ (Snapchat) మాతృ సంస్థ, స్నాప్

ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా తమ ఉద్యోగులను తగ్గించుకోవాలని యోచిస్తున్న కంపెనీల జాబితాలో స్నాప్ కూడా చేరింది. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఉద్యోగుల తొలగింపు విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రపంచ వ్యాప్తంగా పని చేస్తున్న కంపెనీ ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగించనున్నట్లు వెల్లడించింది. 

సంస్థలో ఇప్పటికి 5367 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో 10 శాతం, అంటే సుమారు 540 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. స్నాప్ సంస్థ ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి కాదు. 2022లో 20 శాతం ఉద్యోగులను, 2023లో 3 శాతం ఉద్యోగులను ఇంటికి పంపింది. 

కంపెనీ 10 శాతం ఉద్యోగులను తొలగిస్తుందన్న విషయం ప్రకటించినప్పటికీ.. ఏ విభాగంలో ఎంతమందిని తొలగిస్తుందన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కంపెనీ ఎదుగుదలకు ప్రాధాన్యత ఇస్తూ.. రాబోయే రోజుల్లో మంచి వృద్ధిని సాధించడానికి సంస్థ ఈ లే ఆప్స్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tech Layoffs: అసలేం జరుగుతోంది.. ఒకే నెల‌లో ఇంత మంది టెకీలు ఇంటికా..!

Published date : 07 Feb 2024 02:38PM

Photo Stories