Tenth Class 2024: పదో తరగతిలో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు
పదో తరగతిలో గురుకుల పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రగతి సాధించారు. కార్పొరేట్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు దీటుగా సత్తా చాటారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేసి కార్పొరేట్‌కు ప్రాధాన్యమిస్తే .. నేడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రభుత్వ విద్యాలయాల్లో కోట్లాది రపాయలతో సకల సౌకర్యాలు కల్పించింది. అత్యున్నత ప్రవణాలతో బోధనకు ప్రాధాన్యం ఇచ్చింది. విద్యార్థులు వాటిని వినియోగించుకుని ప్రతిభ కనబరిచారు. తానాం గురుకుల పాఠశాల
విద్యార్థులంతా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.
పరవాడ: తానాంలోని మహాత్మా జ్యోతిబాపూలే ఏపీ బీసీ బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు రికార్డు సృష్టించారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 80 మంది బాలికలు హాజరు కాగా 80 మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. గురుకుల పాఠశాలలో ప్రభుత్వం కల్పింన వసతులతో పాటు ఉపాధ్యాయుల కృషి ఫలింది. విద్యార్థులకు పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించి సబ్జెక్టులపై పట్టు పెరిగే విధంగా తీర్చిదిద్దారు. పాఠ్యాంశాల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపారు. వారిలో చదువు పట్ల మరింత పట్టుదల పెరిగే విధంగా పాఠాలు బోధించి పరీక్షల్లో రాణించడానికి కృషి చేశారు.
సబ్జెక్టుల వారీగా అధిక మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య
సబ్జెక్టు మార్కులు విద్యార్థులు
తెలుగు 99 6
హిందీ 97 1
ఇంగ్లీష్ 99 2
లెక్కలు 100 3
99 2
సైన్స్ 100 1
99 2
సోషల్ 100 9
99 6
చార్టెడ్ అకౌంటెంట్ అవుతా
మాది శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం మల్లేస్‌పేట. తండ్రి రామచంద్రరావు, తల్లి సీతారత్నం వ్యవసాయం చేస్తారు. మేం ఇద్దరు సంతానం. చెల్లి హేమశ్రీ 9వ తరగతి చదువుతుంది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పదో తరగతిలో పట్టుదలగా చదివా. మున్ముందు ఉన్నత చదువుల్లో రాణిస్తూ. ఎంఈసీ సబ్జెక్టు తీసుకొని చార్టెడ్ అకైంటెంట్‌గా రాణిస్తా.
– ఐ.చేతన,
Also Read: Remarkable Score of 599/600 in AP 10th Results 2024!
తానాం గురుకుల పాఠశాల
పోలీసు అధికారినవుతా
మాది బుచ్చెయ్యపేట. వ్యవసాయ కుటుంబం. మా తండ్రి పాతం శ్రీనివాసరావు వ్యవసాయం చేస్తారు. తల్లి సుజాత గృహిణి. నేను పది తరగతిలో 586 మార్కులు సాధించడం గర్వంగా ఉంది. మంచి చదువులు చదివి పోలీసు అధికారిగా ప్రజలకు సేవా చేయాలన్నదే నా లక్ష్యం.
– పి.దివ్య, తానాం గురుకుల పాఠశాల
సివిల్స్ సాధిస్తా..
మాది బుచ్చెయ్యపేట గ్రామం. మా తండ్రి నాయుడు, తల్లి లోవమ్మ. వ్యవసాయం చేస్తుంటారు. మేం ముగ్గురు సంతానం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించాను. ఉన్నత చదువులు చదవాలని ఉంది. ముఖ్యమంగా సివిల్స్ సాధించి సేవ చేయాలని ఉంది.
– ఎస్.ఝాన్సీ, తానాం గురుకుల పాఠశాల
ఐఏఎస్ అవుతా
మాది అనకాపల్లి మండలం రొంగలివానిపాలెం. మా తండ్రి గెడ్డం నాగరాజు ఆటో డ్రైవర్. పదో తరగతిలో మంచి మార్కులు సాధించడానికి పాఠశాల ఉపాధ్యాయులే కారణం. త్రిపుల్‌ఐటీలో చేరి పట్టుదలతో చదివి ఐఏఎస్ కావాలన్నదే నా లక్ష్యం. – జి.సాయి చందన, --- తానాం గురుకుల పాఠశాల
సమష్టి కృషితో శతశాతం ఫలితాలు
తానాం గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు కృషికి విద్యార్థుల పట్టుదల తోడవంతో శతశాతం ఫలితాలు వచ్చాయి. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించే విధంగా తీర్చిదిద్దాం. పాఠశాల నుంచి 80 మంది పరీక్షలకు హాజరైతే 80 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి జిల్లాలో గురుకుల పాఠశాల గౌరవాన్ని మరింత పెంచారు.
– ఎం.అప్పలనాయుడు, ప్రిన్సిపాల్, గురుకుల పాఠశాల, తానాం
Tags
- Gurukula students who have shown potential in class 10th
- AP Tenth results
- highest score in ap tenth board
- tenth results announcement
- ap tenth students talent
- ap tenth class results 2024
- 10th class results updates
- talent and scores of tenth students
- topper in ap 10th board
- GurukulaSchools
- Class10th
- CorporateSchools
- GovernmentNeglect
- YSRCPGovernment
- FirstClassPass
- sakshieducation updates