JEE Advanced 2024 Registration Begins: నేటి నుంచే జేఈఈ అడ్వాన్స్ డ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ -2024కు దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచే జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024కు దరఖాస్తుల నమోదు ప్రారంభం అయ్యింది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఐఐటీ మద్రాస్ నిర్వహించనున్నది.
జేఈఈ మెయిన్‌లో కటాఫ్ మార్కులు పొంది ఉత్తీర్ణత సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులకి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హులు. అభ్యర్థులు జేఈఈ అధికారిక సైట్ jeeadv.ac.in నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. కాగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష మే 26న ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్ 1 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ -2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను మే 17 నుంచి 26 వరకు అభ్యర్థులకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఇక, జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను జూన్ 9వ తేదీన విడుదల చేస్తారు.