Skip to main content

Mega job fair: రేపు మెగా జాబ్‌ మేళా

Mega job fair tomorrow

రాజమహేంద్రవరం రూరల్‌: నగరంలోని మార్గాని ఎస్టేట్స్‌ ప్రాంగణంలో శుక్రవారం మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ తెలిపారు. మేళాకు సుమారు 70 కంపెనీలు వస్తున్నాయని, దాదాపు 700 నుంచి 800 మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునే వారికి పీఎం స్వానిధి పథకం ద్వారా బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. చిరు వ్యాపారులు ఆధార్‌ కార్డుతో పాటు, వ్యాపారం నిర్వహిస్తున్న తోపుడు బండి ఫొటోతో కలిసి దరఖాస్తును నగర పాలక సంస్థ కార్యాలయంలో అందజేయాలన్నారు. ప్రధానమంత్రి ఎంప్లాయిస్‌ గ్యారంటీ స్కీమ్‌ కింద ఇండస్ట్రీ ఏర్పాటుకు రూ.1 లక్ష నుంచి రూ.50 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు.
ప్రకాశం నగర్‌: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్యర్యంలో మార్గాని ఎస్టేట్స్‌లో జరిగే జాబ్‌మేళాకు 19 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు సంవత్సరాల లోపు పదోతరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ చదివిన వారు అర్హులని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండలరావు తెలిపారు. ముందుగా టీటీఈఆర్‌.కామ్‌ జాబ్‌ మేళా 250823లో తమ వివరాలతో రిజిస్టర్‌ అవ్వాలన్నారు. వివరాలకు 91339 12947, 63027 81314 నంబర్లను సంప్రదించాలన్నారు.

చదవండి: Mega Job Fair: 26న పీలేరులో మెగా జాబ్‌ మేళా

దేశానికే గర్వకారణం : ఎంపీ భరత్‌
చంద్రయాన్‌ 3 మిషన్‌ విజయవంతం కావడం దేశానికే గర్వకారణమని ఎంపీ అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

Published date : 24 Aug 2023 03:10PM

Photo Stories