Skip to main content

Course and Job Offer: సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ కోర్సులతో ఉద్యోగావకాశాలు.. శిక్షణకు తేదీ..!

చదువు పూర్తి చేసుకున్న నిరుద్యోగులకు శుభవార్త. సాఫ్‌వేర్‌ డెవలపర్‌ శిక్షణతో ఉద్యోగం పొందవచ్చని జిల్లా నైపుణ్యాధికారి ప్రకటించారు. ఈ నేపథ్యంలో శిక్షణ, అర్హతల గురించి వెల్లడించారు..
Job opportunity for Graduates with software developer course

సాక్షి ఎడ్యుకేషన్‌: స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలోని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థకు చెందిన స్కిల్‌హబ్‌లో ఈ నెల 20 నుంచి జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ శిక్షణ ప్రారంభించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్‌.శ్రీనివాస రావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Practical Exams: ఎంపీఏ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు మొదలు..

ఇంటర్‌, డిగ్రీ, పీజీ పూర్తిచేసిన నిరుద్యోగ యువతీయువకులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులని పేర్కొన్నారు. నూతన సాంకేతికతను ఉపయోగించి ఇండస్ట్రీ నిపుణులతో శిక్షణ ఇస్తామని వెల్లడించారు. శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి గల యువతీయువకులు 99 888 53335 ఫోన్‌ నంబరులో సంప్రదించాలని సూచించారు.

Published date : 14 Feb 2024 04:08PM

Photo Stories