Job Mela: తిరుపతిలో ఉద్యోగావకాశం..

సాక్షి ఎడ్యుకేషన్: తిరుచానూరు రోడ్డు, పద్మావతిపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఈ నెల 7వ తేదీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఉప ఉపాధి అధికారి ఎస్.వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా రిలయన్స్ నిపాన్ లైఫ్ ఇన్‌స్రూ సంస్థలో లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్‌గా తిరుపతిలో ఉద్యోగం చేసేందుకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 30 నుంచి 40 ఏళ్ల లోపు ఉన్న స్త్రీలు అర్హులని తెలిపారు.
➤ Abacus Competitions: విద్యార్థులకు అబాకస్ పోటీ పతకాలు..
అపోలో ఫార్మసీలో రిటైల్ ట్రైనీ, అసోసియేట్/ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు 18నుంచి 30ఏళ్లలోపు వయసు కలిగి పది, ఇంటర్, డిగ్రీ, ఎం ఫార్మ్, బీఫార్మ్, డిఫార్మ్ చేసినవారు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు 99638 35858, 6369429950ను సంప్రదించాలని తెలిపారు. ‘‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఎన్‌ఐసీ.ఇన్’’ అనే వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.