Abacus Competitions: విద్యార్థులకు అబాకస్ పోటీ పతకాలు..
Sakshi Education
ఇటీవలె నర్వహించిన అబాకస్ పోటీలు జిల్లా స్థాయిలో జరిగాయి. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో ప్రతిభ చాటిన వారికి ఫలితంగా పతకాలను అందజేసే కార్యక్రమం నిర్వహించారు..
సాక్షి ఎడ్యుకేషన్: అబాకస్ సాధనతో పిల్లల్లో మేథో సంపత్తి పెరుగుతుందని ఏఎస్పీ బీహెచ్.విమలకుమారి తెలిపారు. ధరణి అబాకస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అబాకస్‌పై జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ చాటిన వివిధ రాష్ట్రాలకు చెందిన 390 మంది విద్యార్థులకు ఆదివారం తిరుపతిలోని ఆఫీసర్స్ క్లబ్‌లో ట్రోఫీలు, పతకాలు, సర్టిఫికెట్లను అందించారు.
దీనికి ఏఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో ధరణి అబాకస్ డైరెక్టర్ ఎం.రవికుమార్, గూడూరు ఆర్డీఓ ఎం.కిరణ్‌కుమార్, చంద్రగిరి డీఎస్పీ టిడి.యశ్వంత్, జాతీయ సంస్కృత వర్సిటీ ప్రొఫెసర్ ఎ.సచ్చిదానందమూర్తి, ప్రభుత్వ వైద్యశాఖ లీగల్ అడ్వైజర్ ఎండి.తయూబ్, వివిధ పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Published date : 06 Nov 2023 11:31AM