Banking Technology: బ్యాంకింగ్ టెక్నాలజీలో పీజీ డిప్లొమా.. అర్హులు వీరే..
సాక్షి ఎడ్యుకేషన్: బ్యాంకింగ్ రంగంలో పనిచేయాలనుకునే వారికోసం పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (పీజీడీబీటీ) ప్రకటన వెలువడింది. ఇందులో భాగంగా 2024 సంవత్సరానికి ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ), హైదరాబాద్.. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కోర్సులో చేరినవారు బ్యాంకులూ, ఆర్థిక సంస్థలకు అవసరమైన సాంకేతికాంశాలపై శిక్షణను సొంతం చేసుకోవచ్చు. కోర్సు చివరలో క్యాంపస్ ప్లేస్‌మెంట్ల ద్వారా ఉద్యోగావకాశాలు పొందొచ్చు.
ఐడీఆర్‌బీటీ
ప్రస్తుతం ఆధునిక యుగంలో అన్ని రంగాలు సాంకేతికత ఆధారంగానే నడుస్తున్నాయి. సేవా రంగమైన బ్యాంకింగ్‌పై ఆ ప్రభావం మరీ ఎక్కువ. బ్యాంకులు, ఆర్థిక సంస్థల సమర్థ నిర్వహణలో టెక్నాలజీ అవసరాన్ని ఆర్‌బీఐ గుర్తించింది. ఇందుకోసం 1996లో ఐడీఆర్‌బీటీని హైదరాబాద్‌లో మసాబ్ ట్యాంకు ఎన్‌ఎండీసీ సమీపంలో నెలకొల్పింది. ఈ సంస్థ భారతీయ బ్యాంకులు, ఆర్థిక విభాగాలకు అవసరమైన టెక్నాలజీని అందించడంతోపాటు ఆ రంగాలకు అవసరమైన సాంకేతికాంశాలపై పరిశోధనలు నిర్వహిస్తోంది.
Technical Graduate Course: మిలిటరీ అకాడమీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుకు ప్రవేశాలు.. అర్హులు వీరే..!
పీజీడీబీటీ కోర్సు
వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడం, బ్యాంకులకు నిర్వహణ ఖర్చులు తగ్గించడం, అవి లాభదాయకంగా మారడానికి టెక్నాలజీ, మేనేజ్‌మెంట్ విభాగాల్లో సమర్థ మానవ వనరులు కీలకం. ఆ దిశగా ఆవిర్భవించిందే బ్యాంకింగ్ టెక్నాలజీ పీజీ డిప్లొమా కోర్సు. దీన్ని 2016 నుంచి అందిస్తున్నారు. ప్రస్తుతం, 2024 బ్యాచ్‌లో ప్రవేశాలకు ఐడీఆర్‌బీటీ ప్రకటన విడుదల చేసింది. తాజా ప్రకటన ద్వారా ప్రవేశాలు పొందిన వారికి జూలై 1 తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
» మొత్తం సీట్లు: 40(వీటిలో 10 స్పాన్సర్డ్. వీటిని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కేటాయించారు)
NEET UG 2024 City Slip Released : నీట్-UG సిటీ స్లిప్ వచ్చేసింది.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
అర్హత
కనీసం 60 శాతం మార్కులతో బీటెక్ లేదా ఏదైనా సబ్జెక్టులో ఫస్ట్ క్లాస్‌తో పీజీని 10+2+4 విధానంలో చదివుండాలి. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్, క్యాట్, జీమ్యాట్, జీఆర్‌ఈ, సీమ్యాట్,గ్జాట్, మ్యాట్, ఆత్మా.. వీటిలో ఏదో ఒక స్కోరు తప్పనిసరి.
ఎంపిక విధానం
వచ్చిన దరఖాస్తులను స్కోరు ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి.. వాటిలో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
కోర్సు వ్యవధి ఏడాది
కోర్సును ఫుల్‌టైం విధానంలో ఏడాది వ్యవధితో అందిస్తున్నారు. ఇందులో సాంకేతిక వినియోగం, సమన్వయం, నిర్వహణల గురించి నేర్పిస్తారు. మారుతున్న సాంకేతికత బ్యాంకింగ్ రంగానికి ఎలా అనువర్తించాలో విద్యార్థులు నేర్చుకుంటారు. వీరికి ఆధునికి సాంకేతిక అంశాల్లో శిక్షణ అందించి టెక్నో నిపుణులుగా తయారుచేస్తారు.
Stenographer Posts: ఎంఏసీఎస్ ఏఆర్‌ఐలో స్టెనోగ్రాఫర్ పోస్టులు
కోర్సు స్వరూపం
ఈ కోర్సు మొత్తం 4 టర్మ్‌ల్లో ఉంటుంది. కోర్సు ఫీజు వసతితో కలిపి రూ.5 లక్షలు ఉంటుంది. బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కూడా పొందవచ్చు. ఈ కోర్సులో లెక్చరర్లు, సెమినార్లతోపాటు ఐటీ నిపుణులతో ఇంటరాక్టివ్ సెషన్లు ఉంటాయి. సీనియర్ బ్యాంకర్లతోపాటు సంస్థకు చెందిన రీసెర్చ్ సెంటర్లు ఇందులో భాగమవుతాయి. క్రిప్టోగ్రఫీ, డేటాబేస్ మేనేజ్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఐవోటీ, బిగ్‌డేటా, అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, మొబైల్ బ్యాంకింగ్, పేమెంట్ సిస్టమ్ మొదలైన అంశాల్లో శిక్షణ ఇస్తారు. చివరి టర్మ్‌లో ప్రాజెక్ట్ వర్క్.. ఫ్యాకల్టీ సభ్యుల పర్యవేక్షణలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో దీన్ని పూర్తిచేయాలి.
స్టైపెండ్
ప్రతిభావంతులు ప్రాజెక్ట్ వర్క్ సమయంలో స్టైపెండ్ కూడా పొందవచ్చు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసిన వారికి పీజీ డిప్లొమా ప్రధానం చేస్తారు.
Agricultural Officer: విద్యార్థుల భాగస్వామ్యంతోనే అభివృద్ధి
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్
ఈ కోర్సు పూర్తిచేసినవారికి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కూడా లభిస్తాయి. హెచ్‌డీఎఫ్‌సీ, బంధన్, ఐyీ బీఐ, కరూర్ వైశ్య, ఫెడరల్, కొటక్, సౌత్ ఇండియా, ఎన్‌పీసీఐ, తదితర సంస్థల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ సొంతం చేసుకోవచ్చు.
ముఖ్యసమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.04.2024
» వెబ్‌సైట్: www.idrbt.ac.in/pgdbt
Consultant Posts: న్యూ ఢిల్లీలో కన్సల్టెంట్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ!