Skip to main content

Child Home: చిల్డ్రన్‌ హోంలో ఉద్యోగానికి ఇంట‌ర్వ్యూలు

కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో జ‌రిగిన ఈ ఇంట‌ర్వ్యూకు సంబంధించి కార్య‌క్ర‌మాలు ముగిసాయి. అనంత‌రం పోస్టుల భ‌ర్తీకి పద్ధితి ప్ర‌కారం జిల్లా క‌మిటీ నిర్ణ‌యంతో ఎంపిక‌లు జ‌రుగుతాయ‌ని తెలిపారు.
Interview of a woman under DRO Venkata Ramana
Interview of a woman under DRO Venkata Ramana

సాక్షి ఎడ్యుకేష‌న్: స్త్రీ, శిశు సంక్షేమశాఖకు సంబంధించి ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఎడాప్షన్‌ యాక్ట్‌, చిల్డ్రన్‌ హోంలో కాంట్రాక్టు పద్ధతిలో పోస్టుల భర్తీకి బుధవారం సర్టిఫికెట్ల పరిశీలన, ఇంటర్వ్యూలు నిర్వహించారు. సమావేశపు హాలులో డీఆర్వో పి. వెంకటరమణ సమక్షంలో ఈ ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 12 పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు 83 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Research Program: స్టూడెంట్‌ రీసెర్చ్‌ స్కాలర్‌షిప్ కు ఎంపికైన వైద్య‌ విద్యార్థులు

ఈ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేసి ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీటి అనంతరం అర్హతల ప్రకారం జిల్లా కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుందని, ఆ ప్రకారం నియమకాలు చేపడతామని డీఆర్వో తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ ఎస్‌. సువర్ణ, డిస్ట్రిక్‌ చైల్డ్‌ ప్రొటక్షన్‌ ఆఫీసర్‌ జాన్సన్‌, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సభ్యురాలు మార్త, జునైల్‌ జస్టిస్‌ బోర్డు మెంబర్‌ అన్నామణి, స్త్రీ, శిశు సంక్షేమశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Published date : 12 Oct 2023 04:18PM

Photo Stories