Zomato CEO Offers Job Opportunity: నెటిజన్ ట్వీట్‌కు ఫిదా అయిన సీఈఓ.. డైరెక్ట్‌గా జాబ్ ఆఫర్
ఆహార వృథాను అరికట్టడానికి జొమాటో కొత్తగా ‘ఫుడ్ రెస్క్యూ’ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఆర్డర్ క్యాన్సిల్ కారణంగా ఉత్పన్నమయ్యే ఆహార వృథా సమస్యను పరిష్కరించడానికి ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు జొమాటో సీఈఓ గోయల్ ఇటీవల ప్రకటించారు. కొత్త ఫీచర్ ద్వారా కస్టమర్‌లు ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసిన తర్వాత నిమిషాల వ్యవధిలో ఫుడ్‌ను తగ్గింపు ధరతో ఇతర కస్టమర్లు పొందవచ్చు. జొమాటోలో నెలకు సగటున దాదాపు నాలుగు లక్షల ఆర్డర్‌లు క్యాన్సిల్ అవుతున్నాయి.
కొత్త ఫీచర్‌కు సంబంధించిన ప్రకటనపై సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. క్యాన్సిల్ చేసిన ఆర్డర్‌లను కొనుగోలు చేయడంలో భద్రత ప్రశ్నార్థకంగా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. చాలా మంది వినియోగదారులు ఆహారం వృథా అవ్వకుండా రాయితీపై భోజన సదుపాయాన్ని కల్పించే విధానాన్ని ప్రశంసిస్తున్నారు.
అయితే బెంగళూరుకు చెందిన ప్రోడక్ట్ మేనేజర్ భాను అనే నెటిజన్ ఈ ఫీచర్ దుర్వినియోగాన్ని నిరోధించడానికి మరిన్ని నిబంధనలు అమలు చేయాలని కంపెనీకి సూచిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
Job Mela: ఐటీఐ కళాశాలలో జాబ్‌మేళా.. పూర్తి వివరాలివే
‘ఫుడ్ రెస్క్యూ ఫీచర్‌లో క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్‌లను మినహాయించాలి. డెలివరీ పార్ట్‌నర్ వినియోగదారుల లోకేషన్‌కు 500 మీటర్ల పరిధిలో ఉంటే కస్టమర్‌లు ఆర్డర్‌లను రద్దు చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. ఓకే స్థానంలో ఉన్న ఇద్దరు వినియోగదారుల్లో ఒకరు ఫుడ్ బుక్ చేసి క్యాన్సిల్ చేసిన వెంటనే పక్కనే ఉన్న మరో కస్టమర్ దాన్ని రాయితీతో తిరిగి బుక్ చేసి ఇద్దరూ షేర్ చేసుకునే అవకాశం ఉంది.
కాబట్టి మరిన్ని నిబంధనలు తీసుకురావాలి. ఈ ఫీచర్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి కంపెనీ ప్రతి కస్టమర్‌కు క్యాన్సిల్ చేసే ఆర్డర్లలో పరిమితులు విధించాలి. రోజుకు గరిష్ఠంగా రెండు ఆర్డర్లు మాత్రమే రద్దు చేసేందుకు వీలు కల్పించాలి’ అని నెటిజన్ పోస్ట్ చేశారు.
Job Recruitment: ఇంజనీర్ జాబ్స్ కోసం నోటిఫికేషన్.. జీతం రూ.25వేలు
దీనికి స్పందించిన జొమాటో సీఈఓ ఈ సూచనలు ఇప్పటికే కొత్త ఫీచర్‌లో చేర్చబడినట్లు చెప్పారు. నెటిజన్ సలహాలు, ఆలోచనలను మెచ్చుకుంటూ తన వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ‘ఎవరు మీరు ఏమి చేస్తారు? మీ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు ఇష్టమైతే మనం కలిసి పని చేద్దాం’ అని పోస్ట్ చేశారు.
validations
— Bhanu (@BhanuTasp) November 10, 2024
1.should not be applicable to COD
2.Cancellation should not be allowed if the delivery reaches 500 m to the delivery point
3.Chances of 2 idiots sharing meals ordering and cancelling at the same time getting a discount place
4.< two cancellations are allowed/ month.
Thanks a lot.
— Bhanu (@BhanuTasp) November 10, 2024
I am from Bangalore
Regularly use blinkit
I regularly keep giving suggestions to improve services via twitter by tagging your company.
Always thinking to reduce -ve impact and improve service delivery.
Working as a PM in a startup company.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)