Skip to main content

Job Offer: బంపర్ ఆఫర్.. రోజుకు రూ.28000 జీతం.. ఏడు గంటలే పని!!

ప్రముఖ అమెరికన్ కంపెనీ టెస్లా రోజుకు ఏడు గంటలు నడవడానికి ఇష్టపడే వ్యక్తుల కోసం ఒక జాబ్ ఆఫర్ చేసింది.
High paying job opportunity job with high earning potential Tesla is paying up to Rs 28000 a day if you can walk 7 hours in a suit to train robot

ఈ ఉద్యోగంలో చేరే వ్యక్తులు గంటకు 48 డాలర్లు లేదా సుమారు 4000 రూపాయలు పొందవచ్చు. ఈ లెక్కన ఏడు గంటలు పనిచేస్తే రోజుకు రూ.28000 సంపాదించుకోవచ్చు. ఇంతకీ జాబ్ ఏంటి? అక్కడ ఏం చేయాల్సి ఉంటుందనే విషయాలు వివరంగా ఇక్కడ చూసేద్దాం.
 
టెస్లా కంపెనీ తన హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్‌ను వేగంగా అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగమైన మోషన్-క్యాప్చర్ టెక్నాలజీలో ఉపయోగించి రోబోట్‌లకు ట్రైనింగ్ ఇవ్వడానికి సంస్థ సన్నద్ధమైంది. దీనికోసమే ఉద్యోగాలను ప్రకటించింది. ఈ రంగంలో ప్రత్యేకమైన అనుభవం ఉన్న వ్యక్తులకు ఇది గొప్ప సువర్ణావకాశం అనే చెప్పాలి.

Jobs

టెస్లా కంపెనీ ప్రకటించిన ఈ ఉద్యోగంలో చేరాలనుకునే వ్యక్తులు మోషన్-క్యాప్చర్ సూట్ & వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్ ధరించి రోజూ ఏడు గంటల సమయం నిర్దిష్ట మార్గాల్లో నడవడం ఉంటుంది. ఇందులో భాగంగానే డేటా సేకరించడం, విశ్లేషించడం వంటివి చేయాలి. వీటితో పాటు ఉద్యోగంలో చేరాలనుకునే వ్యక్తి ఎత్తు 5'7' నుంచి 5'11' ఎండీ ఉండాలి. వీరు 13 ఫౌండ్స్ బరువును కూడా మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.

ఉద్యోగంలో మూడు షిఫ్టులు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. అవి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:30, సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12:00 వరకు.. అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 8:30 గంటల వరకు. అంటే ఈ ఉద్యోగంలో చేరాలనుకునేవారు కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో పని చేయాల్సి ఉంటుంది. 

Below Salary: దేశంలో 68 శాతం మంది జీతం.. రూ.20 వేల లోపే!!

Published date : 20 Aug 2024 05:28PM

Photo Stories