Cricketer Rohit Sharma: అయిదు లక్షల విద్యార్థులకు లియో1 సేవలు
Sakshi Education
న్యూఢిల్లీ: క్రికెటర్ రోహిత్ శర్మ మద్దతిస్తున్న ఫీజుల మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ సంస్థ లియో1 తమ కార్యకలాపాలను విస్తరిస్తోంది.
తాజాగా 5 లక్షల విద్యార్థుల మైలురాయిని అధిగమించినట్లు సంస్థ వివరించింది. విద్యా సంస్థలకు ఫీజ్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ అందించడంతో పాటు విద్యార్థులకు స్మార్ట్ ఐడీ కార్డులు, సకాలంలో చెల్లింపులు జరిపితే రివార్డులివ్వడం, ఆర్థిక అక్షరాస్యత ప్రోగ్రాంలు మొదలైనవి నిర్వహించడం తదితర కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.
చదవండి: SBIF Scholarship Program : పేద విద్యార్థులకు ఎస్‌బీఐ ఆర్థిక సాయం.. స్కాలర్‌షిప్ పూర్తి వివరాలు ఇవే
రివార్డుల కింద ఇచ్చే లియో1 కాయిన్లను విద్యార్థులు జొమాటో, నైకా తదితర 175 బ్రాండ్ పార్ట్‌నర్స్ వద్ద రిడీమ్ చేసుకోవచ్చని తెలిపింది.
Published date : 23 Oct 2024 12:34PM