Zomato delivery boy: ఉదయమంతా ఫుడ్ డెలివరీ చేసేవాణ్ని... రాత్రి పూట చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సాధించానిలా...
తమిళనాడుకు చెందిన విఘ్నేష్ కొంతకాలంగా జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థికంగా కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తూనే ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేవాడు. రోజంతా ఫుడ్ డెలివరీ చేసిన తర్వాత రాత్రి సమయంలో పరీక్షలకు ప్రిపేరయ్యేవాడు.
ఇటీవల తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎన్పీఎస్సీ) గ్రూప్ 4 పరీక్షల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. కుటుంబ పోషణ కోసం జొమాటో బాయ్‌గా చేస్తూనే మరోవైపు పరీక్ష కోసం ప్రిపేరయ్యేవాడు విఘ్నేష్. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎంత పోటీ ఉందో మనందరికి తెలిసిన విషయమే. కానీ, పోటీలో మిగిలిన వారిని వెనక్కి నెట్టి విఘ్నేష్ ఉద్యోగం సాధించాడు.
తమ ఫుడ్ డెలివరీ పార్టనర్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాడంటూ జొమాటో ట్వీట్ చేయడంతో ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. తన కుటుంబంతో పాటు ఉన్న ఫొటోను జొమాటో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ స్టోరీకి విపరీతమైన వ్యూస్, లైక్స్‌తో పాటు షేర్స్ వస్తున్నాయి.
తపన, సంకల్పం బలంగా ఉన్నప్పుడే ఇలాంటి అద్భుత విజయాలు సాధిస్తారని యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు 'కంగ్రాట్స్' అని కామెంట్లు పెడుతున్నారు. కఠోర శ్రమ ఫలితం అమృతం కంటే తీపిగా ఉంటుందని మరికొందరు ప్రశంశిస్తున్నారు.
ఇవీ చదవండి: పేద విద్యార్థులకు వరం... ఏడాదికి లక్షరూపాయలకు పైగా ఉపకారవేతనం.. ఇలా దరఖాస్తు చేసుకోండి
టీఎన్పీఎస్సీ ఫలితాలు....
తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎన్పీఎస్సీ) గ్రూప్-4 ఫలితాలను ఇటీవల విడుదల చేసింది. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను తదుపరి ఎంపిక ప్రక్రియ ఆధారంగా వివిధ పోస్టుల్లో నియమిస్తారు. విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్ గ్రేడ్-1, బిల్ కలెక్టర్, ఫీల్డ్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ వంటి వివిధ పోస్టుల భర్తీ కోసం టీఎన్‌పీఎస్‌సీ గ్రూప్-4 పరీక్ష నిర్వహించింది.