Skip to main content

PM YASASVI: పేద విద్యార్థుల‌కు వ‌రం... ఏడాదికి ల‌క్ష‌రూపాయ‌ల‌కు పైగా ఉప‌కార‌వేత‌నం.. ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో విద్య పేదోడికి భారంగా మారింది. ప్రాథ‌మిక విద్య పూర్త‌యిన త‌ర్వాత ప్రాథ‌మికోన్న‌త విద్య‌ను చ‌దివేందుకు అనేక‌మంది మొగ్గుచూప‌ట్లేదు. ఇంట్లో ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో బాల్యంలోనే వారిని కూలీ ప‌నుల‌కు పంపిస్తున్నారు.

అయితే ప్ర‌తిభ ఉండీ, ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో చ‌దువుకు దూర‌మ‌వుతున్న విద్యార్థుల‌కు మాత్రం ఇదొక వ‌ర‌మనే చెప్పాలి. 

30వేల మందికి ల‌బ్ధి...
పేదింటి విద్యార్థుల‌ను బ‌డికి ద‌గ్గ‌ర‌చేర్చి, వారిని ఉన్న‌త విద్య‌వైపు అడుగులు వేసేలా కేంద్ర ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తోంది. ఇందులో భాగంగా ‘పీఎం యశస్వి’ PM YASASVI (యంగ్‌ అచీవర్స్‌ స్కాలర్‌షిప్‌ అవార్డు స్కీమ్‌ ఫర్‌ వైబ్రెంట్‌ ఇండియా) స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది 30వేల స్కాలర్‌షిప్స్‌ కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) యశస్వి-2023 ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

చ‌ద‌వండి: డిగ్రీ అర్హ‌త‌తో 1,876 ఎస్సై ఉద్యోగాలు... వ‌య‌సు, జీతం.. మిగిలిన‌ పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

PM YASASVI

స్కాలర్‌షిప్‌న‌కు అర్హులు ఎవ‌రంటే...? 
ఉప‌కార‌వేత‌నానికి అర్హ‌త సాధించాలంటే మొద‌ట ప్ర‌వేశ ప‌రీక్ష‌ల్లో పాస‌వ్వాలి. ఎనిమిదో తరగతి పూర్తయిన వారు మాత్ర‌మే పరీక్ష రాసేందుకు అర్హులు. ఎనిమిద‌వ త‌ర‌గ‌తి పూర్తియి.. 9, 11వ‌ తరగతులు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2.5 లక్షలకు మించకూడ‌దు. ఓబీసీ, ఈబీసీ, సంచారజాతులకు చెందిన పిల్లలకు ప్రాధాన్యం ఇస్తారు.

చ‌ద‌వండి: అనారోగ్యంతో భ‌ర్త చ‌నిపోయాడు... ఆయ‌న చివ‌రికోరికే న‌న్ను 51 ఏళ్ల‌లో ప్ర‌భుత్వ ఉద్యోగం సాధించేలా చేసింది

PM YASASVI

75 వేల నుంచి ల‌క్షా 25 వేల వ‌ర‌కు....
యశస్వి ప్రవేశ పరీక్షలో మెరిట్‌ సాధించిన విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజు, హాస్టల్‌ ఫీజు చెల్లించేలా స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని ఒకేసారి జమచేస్తారు. 9, 10 తరగతులు చ‌దివే విద్యార్థుల‌కు సంవ‌త్స‌రానికి రూ.75 వేలు... 11, 12వ‌ తరగతులకు రూ.1,25,000 చొప్పున ఉపకారవేతనంగా చెల్లిస్తారు. పూర్తిగా మెరిట్ ఆధారంగా అర్హులను ఎంపిక చేసి, స్కాల‌ర్‌షిప్ మొత్తాన్ని బ్యాంకు అకౌంట్లో జమ చేస్తారు.

చ‌ద‌వండి: టీఎస్‌పీఎస్సీ వివిధ ప‌రీక్ష‌ల కొత్త‌ తేదీ ఇవే.. అలాగే గ్రూప్‌-2 & 3 ప‌రీక్ష‌లు కూడా.. 

ఇలా దరఖాస్తు చేసుకోండి...
ఉపకార వేత‌నం పొందేందుకు ఎలాంటి ఫీజు చెల్లించ‌న‌వ‌స‌రం లేదు. విద్యార్థులు త‌మ వివ‌రాల‌తో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల మొబైల్‌నంబ‌ర్‌, బ్యాంకు ఖాతా, కుల‌, ఆదాయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌తో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ఆగస్టు 8వ తేదీ అర్ధ‌రాత్రి వరకు విద్యార్థులు https://yet.nta.ac.in/ వెబ్‌సైట్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆగస్టు 12 నుంచి 16వ తేదీ వరకు తప్పులు సరిచేసుకొనేందుకు వీలుంది. పరీక్ష సెప్టెంబర్‌ 29న దేశ వ్యాప్తంగా నిర్వ‌హిస్తారు. 

PM YASASVI

చ‌ద‌వండి: దేశవ్యాప్తంగా 58 వేల‌ ఉపాధ్యాయ ఖాళీలు... ఆర్టీఐ ద్వారా విస్తుపోయే అంశాలు వెలుగులోకి

ఇంగ్లిష్‌, హిందీ భాష‌ల్లో మాత్ర‌మే... 
రెండున్న‌ర్ర గంట‌ల పాటు ప‌రీక్ష ఉంటుంది. మొత్తం 100 ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు రాయాల్సి ఉంటుంది. మార్కులు వంద‌. అయితే ప‌రీక్ష మాత్రం ఇంగ్లిష్‌, హిందీ భాష‌ల్లో మాత్ర‌మే రాయాలి. గ‌ణితానికి 30, సైన్స్‌, సోషల్ సబ్జెక్టులకు 25, జనరల్‌ నాలెడ్జ్‌కు 20 మార్కుల చొప్పున 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. నెగ‌టివ్ మార్కులు లేవు. 

Published date : 25 Jul 2023 03:21PM

Photo Stories