Skip to main content

Delhi Police Recruitment 2023: డిగ్రీ అర్హ‌త‌తో 1,876 ఎస్సై ఉద్యోగాలు... వ‌య‌సు, జీతం.. మిగిలిన‌ పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

స్టాఫ్ సెలక్షన్ కమిషన్... ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌)లో సబ్-ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష-2023కు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
Delhi Police Recruitment 2023
డిగ్రీ అర్హ‌త‌తో 1,876 ఎస్సై ఉద్యోగాలు... వ‌య‌సు, జీతం.. మిగిలిన‌ పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

ఈ పరీక్ష ద్వారా ఢిల్లీ పోలీసు విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన(సీఏపీఎఫ్‌) బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలో సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆగస్టు 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీలు:

1. సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్(బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ)లో సబ్-ఇన్‌స్పెక్టర్ (జీడీ): 1714 పోస్టులు

2. ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్)- పురుషులు/ మహిళలు: 162 పోస్టులు

ఇవీ చ‌ద‌వండి: యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ.50,000 జీతం..

మొత్తం పోస్టుల సంఖ్య: 1,876.

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయ‌సు: 01.08.2023 నాటికి 20-25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం: నెలకు రూ.35,400-రూ.1,12,400.

STAFF SELECTION COMMISSION

ఎంపిక: సీబీటీ రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష (పీఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (సీఎస్‌టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

AP Teaching Jobs: 590 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌!

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్.

ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 15.08.2023.

దరఖాస్తు సవరణ తేదీలు: 16.08.2023 నుంచి 17.08.2023 వరకు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: అక్టోబర్, 2023.

వివ‌రాల‌కు https://ssc.nic.in/ వెబ్‌సైట్ సంద‌ర్శించ‌వ‌చ్చు.

                                         ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఇక్క‌డ క్లిక్ చేయండి

​​​​​​​NESTS: డిగ్రీ, బీఈడీ అర్హ‌త‌తో 6329 ఉద్యోగాలు... ప్రారంభ వేత‌నం రూ.45 వేలు.. వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Published date : 24 Jul 2023 04:13PM
PDF

Photo Stories