Skip to main content

NESTS: డిగ్రీ, బీఈడీ అర్హ‌త‌తో 6329 ఉద్యోగాలు... ప్రారంభ వేత‌నం రూ.45 వేలు.. వివ‌రాల‌కు క్లిక్ చేయండి

నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (నెస్ట్స్) ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈఎంఆర్ఎస్ఎస్)లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీకి ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామినేషన్ (ఈఎస్ఎస్ఈ) నోటిఫికేష‌న్ జారీ చేసింది.
National Education Society for Tribal Students
Eklavya Model Residential School

6329 పోస్టుల‌కు తాజా ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

పోస్ట్ వివరాలు:

1. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ): 5660 పోస్టులు

సబ్జెక్టు: హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, తెలుగు, ఉర్దూ, మిజో, సంస్కృతం, సంతాలి, మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ (పురుషుడు), పీఈటీ (మహిళ), లైబ్రేరియన్.

చ‌ద‌వండి: ఎన్‌డీఆర్‌ఐ, కర్నాల్‌లో రీసెర్చ్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.49,000 వ‌ర‌కు జీతం..

2. హాస్టల్ వార్డెన్ (పురుషులు): 335 పోస్టులు

3. హాస్టల్ వార్డెన్ (మహిళ): 334 పోస్టులు

అర్హత: డిగ్రీ, బీఎడ్, బీపీఎడ్, B.Li.Sc, సీటెట్ ఉత్తీర్ణత.

వయోపరిమితి (18.8.2023 నాటికి): 18-35 ఏళ్లు. 

పే స్కేల్: నెలకు టీజీటీ రూ.44900-142400/ రూ.35400-112400; హాస్టల్ వార్డెన్ రూ.29200-92300.

చ‌ద‌వండి: ఈఎస్‌ఐసీ, హైదరాబాద్‌లో 76 పోస్టులు.. నెలకు రూ.2,00,000 వ‌ర‌కు జీతం..

ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: టీజీటీ రూ.1500; హాస్టల్ వార్డెన్ రూ.1000. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 18.08.2023

మ‌రిన్ని వివ‌రాల‌కు www.emrs.tribal.gov.in వెబ్‌సైట్ సంద‌ర్శించ‌వ‌చ్చు.

చ‌ద‌వండి: Open-Source AI: చాట్‌జీపీటీ, గూగుల్‌కు పోటీగా మెటా ఓపెన్ సోర్స్ ఏఐ

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Published date : 08 Sep 2023 03:45PM
PDF

Photo Stories