EMRS: కామన్ ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల
Sakshi Education
మహబూబాబాద్: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో (ఈఎంఆర్‌ఎస్) 2023–24 విద్యాసంవత్సరం ఆరో తరగతి ప్రవేశానికి రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన కామన్ ఎంట్రెన్స్ ఫలితాలను రాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మే 31న విడుదల చేశారు.
మానుకోట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ప్రవేశ పరీక్షకు 8,383 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 7,252 మంది పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. మానుకోట జిల్లా నుంచి సుమారు 200 మంది సీట్లు సాధించారని, ఇందులో కిరణ్ 90 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఉమేష్ సెకండ్ ర్యాంక్ సాధించినట్లు వివరించారు. మొదటి విడతలో భాగంగా 1,347 మంది విద్యార్థులకు మోటా అడ్మిషన్ గైడ్‌లైన్స్ ప్రకారం 23 ఎకలవ్య పాఠశాలల్లో సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.
చదవండి:
Published date : 01 Jun 2023 01:44PM