ఆ నిధులతో ‘ఏకలవ్య’ స్కూళ్ల నిర్మాణం
Sakshi Education
సాక్షి, న్యూఢిల్లీ: గిరిజన ప్రాంతాల్లో విద్యా రంగం అభివృద్ధి కోసం కేటాయిస్తోన్న నిధులతో ఏపీ ప్రభుత్వం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం చేపట్టిందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా తెలిపారు.
అలాగే ఏపీలోని పలు జిల్లాల్లని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, ఏకలవ్య సూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 2016-17 నుంచి 2020-21 వరకు రూ.95.45 కోట్లను కేంద్రం కేటాయించినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాజ్యసభలో బదులిచ్చారు. ట్రై యురేనియం ఆక్టోసైడ్, యురేనియం నిల్వలు వైఎస్సార్ కడప, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల పరిధిలో 3,61,748 టన్నులు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. విజయనగరం జిల్లాలో సెంట్రల్ ట్రైబల్ వర్సిటీని ఏర్పాటు చేసే స్థలాన్ని ఏపీ ప్రభుత్వం రెల్లి గ్రామం నుంచి సాలూరు గ్రామానికి మార్చినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ బదులిచ్చారు. ఏపీలో ‘న్యాయమిత్ర’ కార్యక్రమం అమల్లో లేదని ఎంపీ వేమిరెడ్డి ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానమిచ్చారు. గతేడాది జనవరి గణాంకాల ప్రకారం ఏపీలో 47 ఐఏఎస్, 29 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఏపీలో సమర్థ్ పథకంలో భాగంగా మొత్తం 508 మంది లబ్ధి పొందినట్లు ఎంపీ వేమిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ జవాబిచ్చారు. సమగ్ర శిక్షా పథకానికి రూ.1,059.96 కోట్లు, మధ్యాహ్న భోజన పథకానికి రూ.285.63 కోట్లు విడుదల చేసినట్లు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్నలకు కేంద్రమంత్రి పోఖ్రియాల్ జవాబిచ్చారు.
Published date : 12 Feb 2021 03:56PM