TSPSC News Exam Dates 2023 : టీఎస్‌పీఎస్సీ వివిధ పరీక్షల కొత్త తేదీ ఇవే.. అలాగే గ్రూప్-2 & 3 పరీక్షలు కూడా..
అలాగే గ్రూప్-3 ఉద్యోగాలకు కూడా అక్టోబర్‌లో పరీక్షలను నిర్వహించనున్నారు. అలాగే తెలంగాణ గురుకుల విద్యాసంస్ధల నియామక బోర్డు 9,210 ఉద్యోగాలకు ఆగస్టు 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్న విషయం తెల్సిందే. ఈ పరీక్షలు 18 రోజులపాటు మూడు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి.
☛ TSPSC Group 2 Postponed : టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 వాయిదా వేయాల్సిందే.. కారణం ఇదే..?
అయితే ప్రస్తుతం గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని జూలై 24వ తేదీన (సోమవారం) ముట్టడించారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో.. రాతపరీక్షల తేదీల ఖరారు విషయంలో టీఎస్‌పీఎస్సీకి తలనొప్పిగా మారింది. అందరికీ అనువుగా సెలవు రోజుల్లో పరీక్ష కేంద్రాల గుర్తింపు కష్టమవుతోంది. ఈ ఏడాది డిసెంబరు వరకు దాదాపు అన్ని శని, ఆదివారాల్లో వివిధ పోటీ, ప్రవేశ పరీక్షలున్నాయి. దీంతో పనిదినాల్లో నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.
అభ్యర్థులు అన్నిరకాల పోటీ పరీక్షలకు హాజరయ్యేందుకు వీలు కల్పించే ప్రయత్నం చేస్తున్నా కొన్ని సందర్భాల్లో అలా సాధ్యంకావడం లేదు. ఏదైనా రాత పరీక్ష ఒకసారి వాయిదా పడితే ప్రస్తుత పరిస్థితుల్లో మరో ఆరునెలల వరకు రీ షెడ్యూల్ చేయడం కష్టంగా మారుతోందని కమిషన్ వర్గాలు చెబుతున్నాయి.
టీఎస్‌పీఎస్సీ వివిధ ప్రశ్నపత్రాల లీకేజీ తర్వాత పరీక్షలను రీషెడ్యూల్ చేసి నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రూప్-3, సంక్షేమ వసతిగృహాల అధికారులు (హెచ్‌డబ్ల్యూవో), డివిజినల్ అకౌంట్స్ అధికారులు (డీఏవో), కళాశాలల లెక్చరర్ల పరీక్షలతో పాటు గ్రూప్-1 ప్రధాన పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ తీవ్రంగా సమాలోచనలు చేస్తోంది. ఈ పోస్టులకు లక్షల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
పరీక్షకేంద్రాలు లేక..
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ తర్వాత ప్రొఫెషనల్ పోస్టులకు పరీక్షలను ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో నిర్వహిస్తున్నారు. గ్రూప్‌లతో పాటు ఇతరత్రా పోస్టులకు లక్షల్లో దరఖాస్తులు రావడంతో ఈ పరీక్షలను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించారు.
గ్రూప్-2 పరీక్షకు 4.83లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష షెడ్యూలును ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించేందుకు కమిషన్ కొన్ని నెలల క్రితమే షెడ్యూలు ప్రకటించింది. పరీక్ష నిర్వహణ కోసం పరీక్ష కేంద్రాలను గుర్తించిన కమిషన్, ఆ రోజుల్లో విద్యాసంస్థలకు సెలవులను కూడా ప్రకటించింది.
☛ చదవండి: TSPSC Group 3 Exam Pattern : 1365 గ్రూప్-3 ఉద్యోగాలు.. పరీక్షా విధానం ఇదే..
గ్రూప్-3 పరీక్ష నిర్వహించేందుకు తేదీలు అందుబాటులో లేవు. రద్దయిన డీఏవో పరీక్షకూ ఇదే పరిస్థితి నెలకొంది. సంక్షేమ వసతిగృహాల అధికారుల పోస్టులకు దరఖాస్తులు స్వీకరించిన కమిషన్ ఇప్పటివరకు తేదీ ఖరారు చేయలేదు. మరోవైపు గ్రూప్-1 ప్రధాన పరీక్ష తేదీల ఖరారు పెద్ద పరీక్షగా మారింది. అక్టోబరులో నిర్వహణకు తేదీలు అందుబాటులో లేవు. అపై దసరా సెలవులు ఉన్నాయి. ఆ వెంటనే ఎన్నికల వాతావరణం ఉంటుంది.