Skip to main content

TSPSC Group 2 Postponed : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 వాయిదా వేయాల్సిందే.. కార‌ణం ఇదే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు రాత‌ప‌రీక్ష‌ను ఆగష్టు 29, 30తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు. అయితే ఈ గ్రూప్‌-2 ప‌రీక్ష‌లు రాసే అభ్య‌ర్థులు మాత్రం ఈ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాలని టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని జూలై 24వ తేదీన (సోమ‌వారం) ముట్టడించారు.
TSPSC Group 2 Postponed 2023 News in Telugu
TSPSC Group 2 Postponed 2023

ఈ ముట్ట‌డి కార్య‌క్ర‌మం ఉద్రిక్తత చోటు చేసుకోగా.. భారీగా ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్, గ్రూప్ 4 వంటి పరీక్షలను పూర్తి చేయగా.. గ్రూప్ - 2 నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది టీఎస్‌పీఎస్సీ.  టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంతో బోర్డు ప్రతిష్ట మసకబారిపోగా.. ఇక నుంచైనా అప్రమత్తంగా ఉండాలని భావిస్తోంది.

☛ టీఎస్‌పీఎస్సీ Group-1&2 ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

మొత్తం 783 గ్రూప్‌-2 పోస్ట్‌లకు 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అంటే.. ఒక్కో పోస్ట్‌కు 705 మంది పోటీ ఉన్నట్లు స్పష్టమవుతోంది. భారీ స్థాయిలో గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు పోటీప‌డుతున్నారు.

☛ APPSC/TSPSC Group-2 Jobs Success Tips 2023 : గ్రూప్ -2లో అభ్య‌ర్థులు ఎక్కువ‌గా చేసే లోపాలివే.. వీటిని అధిక‌మిస్తే.. విజ‌యం మీదే..!

ఇప్ప‌టికే.. ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు కాలేజీలు, స్కూళ్ల‌కు సెల‌వులు ప్ర‌క‌టిస్తూ..

tspsc group2 jobs

టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 ప‌రీక్షా కేంద్రాలకు కేటాయించిన ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు కాలేజీలు, స్కూళ్ల‌కు సెల‌వులు ప్ర‌క‌టిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆరోజుల్లో మిగ‌తా ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు స్కూల్స్, కాలేజీలు య‌ధావిధిగా  న‌డుస్తాయ‌ని స్ప‌ష్టం చేసింది. మరోవైపు.. జీవో నెంబర్‌ 46 రద్దు కోరుతూ డీజీపీ కార్యాలయం ఎదుట కానిస్టేబుల్‌ అభ్యర్థులు సైతం ధర్నా చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

☛ చ‌ద‌వండి: TSPSC Group 3 Exam Pattern : 1365 గ్రూప్‌-3 ఉద్యోగాలు.. ప‌రీక్షా విధానం ఇదే..​​​​​​​

☛ చ‌ద‌వండి: TSPSC Group 2&3 Preparation Tips: లక్షల సంఖ్యలో దరఖాస్తులు ... రెండు పరీక్షలకు ఉమ్మడి వ్యూహంతోనే సక్సెస్‌

Published date : 24 Jul 2023 03:59PM

Photo Stories