Skip to main content

RTI: దేశవ్యాప్తంగా 58 వేల‌ ఉపాధ్యాయ ఖాళీలు... ఆర్టీఐ ద్వారా విస్తుపోయే అంశాలు వెలుగులోకి

దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాల‌యాల్లో 30 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ‌త కొన్నేళ్లుగా వీటిని భ‌ర్తీ చేయ‌క‌పోవ‌డంతో విద్యార్థులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. వీటితో పాటు ప్ర‌తిష్టాత్మక‌మైన ఐఐటీల్లోనూ భారీగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయంటే దేశంలో విద్యావ్య‌వ‌స్థ ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. స‌మాచారహ‌క్కు చ‌ట్టం ద్వారా వెలుగులోకి అంశాలు విస్తుపోయేలా ఉన్నాయి.
RTI: దేశవ్యాప్తంగా 58 వేల‌ ఉపాధ్యాయ ఖాళీలు... ఆర్టీఐ ద్వారా విస్తుపోయే అంశాలు వెలుగులోకి
RTI: దేశవ్యాప్తంగా 58 వేల‌ ఉపాధ్యాయ ఖాళీలు... ఆర్టీఐ ద్వారా విస్తుపోయే అంశాలు వెలుగులోకి

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన ఆర్టీఐ కార్య‌క‌ర్త చంద్రశేఖర్ గౌర్.. దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలియ‌జేయాల్సిందిగా ప్ర‌భుత్వాన్ని కోరారు. దీంతో అధికారులు అత‌నికి పూర్తి స‌మాచారం అంద‌జేశారు. ఆర్టీఐ ద్వారా అందిన స‌మాచారం ప్ర‌కారం కేంద్రీయ విద్యాలయాల్లో బోధ‌న‌, బోధ‌నేత‌ర సిబ్బంది పోస్టులు దాదాపు 30 శాతం ఖాళీలు ఉన్నాయ‌ని తెలిసింది.

ఇవీ చ‌ద‌వండి:  ఈ చిట్కాలు పాటిస్తే పోటీ పరీక్ష‌ల్లో విజ‌యం మీదే... మీర్జాపూర్ క‌లెక్ట‌ర్ దివ్య‌మిట్ట‌ల్ స‌క్సెస్ టిప్స్ మీకోసం...!

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బోధ‌నేత‌ర సిబ్బందితో క‌లుపుకుని మొత్తం 65,303 పోస్టులు ఉన్నాయి. ఇందులో టీచింగ్ సిబ్బందికి 49,793 పోస్టులు, బోధ‌నేత‌ర సిబ్బందికి 15,510 పోస్టులు మంజూర‌య్యాయి. అయితే జూన్ 1 నాటికి ఉపాధ్యాయుల్లో 2,590 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ల పోస్టులు, 3,711 టీజీటీ పోస్టులు, 5,241 ప్రైమరీ టీచర్ పోస్టులు, 6,892 నాన్ అకడమిక్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

rti

దేశవ్యాప్తంగా 1200కు పైగా కేంద్రీయ విద్యాలయాలు ఉండగా, వీటిలో 14 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలు 60 సంవత్సరాల క్రితం ప్రారంభ‌మ‌య్యాయి.

అలాగే దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, కేంద్ర ఉన్నత విద్యా సంస్థలు అన్నింటిలో క‌లిపి మొత్తం 58,000 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ పార్లమెంటుకు తెలిపారు.

ఇవీ చ‌ద‌వండి: గూగుల్‌లో ఉద్యోగం వ‌స్తే పండ‌గే.... ఉద్యోగుల‌కు కోట్ల జీతాన్ని ఇస్తోన్న టెక్ దిగ్గ‌జం

teaching

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 3,271 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని లోక్ సభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల సంఖ్య 1,756 అని తెలిపారు.

ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో 4,425 టీచింగ్ పోస్టులు, 5,052 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఇవీ చ‌ద‌వండి: కంపెనీల‌న్నీ కుమ్మ‌క్కు... ఐటీ ఉద్యోగుల‌కు ఇక‌పై క‌ష్ట‌కాల‌మే..!

Published date : 22 Jul 2023 06:04PM

Photo Stories