Skip to main content

Right to Information Act: ఆర్‌.టి.ఐ అమలులో దేశంలో మూడో స్థానంలో ఏపీ

సమాచార హక్కు చట్టం అమలు చేయడంలో దేశంలో ఏపీ మూడో స్థానంలో ఉందని రాష్ట్ర సమాచార కమిషనర్‌ హరిప్రసాదరెడ్డి చెప్పారు.
Right to Information Act,AP Ranks Third in RTI Act Implementation.
Right to Information Act

అక్టోబర్‌ 12న ఆర్టీఐ దినోత్సవం సందర్భంగా నరసరావుపేట భువనచంద్ర టౌన్‌ హాల్‌లో గురువారం నిర్వహించిన ఆర్టీఐ నేషనల్‌ సమ్మిట్‌కు ఆయన హాజరయ్యారు. పల్నాడు రోడ్డులోని మున్సిపల్‌ బాలుర హైస్కూలు నుంచి విద్యార్థులు, ఎన్‌సీసీ, స్కౌట్‌ క్యాడెట్లతో ప్రారంభమైన ఆర్‌టీఐ ర్యాలీకి జేసీ ఎ.శ్యామ్‌ప్రసాద్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

Prakasam Barrage: ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ప్రకాశం బ్యారేజ్‌

అక్కడి నుంచి టౌన్‌హాల్‌ వరకు జై ఆర్‌టీఏ అంటూ విద్యార్థులు చేసిన నినాదాలతో కొనసాగిన ర్యాలీలో వారితోపాటు డీఆర్వో కె.వినాయకం, అడ్మిన్‌ ఎస్పీ ఆర్‌.రాఘవేంద్ర, ఆర్డీవో ఎం.శేషిరెడ్డి కొనసాగారు. అనంతరం టౌన్‌హాలులో హరిప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. అధికారులు ఎప్పటి రికార్డులు అప్పుడు పూర్తి చేసుకొంటే చట్టం ప్రకారం సమాచారమివ్వడం సులభం అవుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద సమాచార హక్కు చట్టం బోర్డులు ఏర్పాటు చేయాలని, అలా చేయని చోట అధికారులే స్వచ్ఛందంగా ఏర్పాటుకు ముందుకు రావాలని సూచించారు. ఇంకా బోర్డులు పెట్టని కార్యాలయాల వివరాలు రాష్ట్ర కమిషన్‌ కార్యాలయంలో తెలిపితే వెంటనే ఏర్పాటు చేస్తామన్నారు.

Eco Sensitive Zone: ఎకో సెన్సిటివ్‌ జోన్‌గా కొల్లేరు

Published date : 14 Oct 2023 10:22AM

Photo Stories