Supreme Court New Judges Oath: సుప్రీంకోర్టు జడ్జీలుగా ముగ్గురు ప్రమాణం
Sakshi Education
ఢిల్లీ, రాజస్తాన్, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు గురు వారం సుప్రీంకోర్టు జడ్జీలు గా ప్రమాణం చేశారు.
వీరి నియామకంతో అత్యున్నత న్యాయస్థానంలో జడ్జీల సంఖ్య పూర్తి స్థాయి 34కు చేరింది. సుప్రీంకోర్టు భవన సముదాయంలో జరిగిన కార్యక్రమంలో మూడు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మసీహ్, జస్టిస్ సందీప్ మెహతాలతో ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ వైవీ చంద్రచూడ్ ప్రమాణం చేయించారు. వీరి పేర్లను కొలీజియం ఈ నెల 6న ఎంపిక చేసి కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే.
Section 377 and 497: 377, 497 సెక్షన్లను భారతీయ న్యాయ సంహిత బిల్లులో సవరణలతో చేర్చే ప్రతిపాదన!
Published date : 10 Nov 2023 03:26PM