Salima Tete: భారత మహిళల హాకీ జట్టు కొత్త కెప్టెన్‌గా సలీమా.. భారత హాకీ జట్టు ఇదే..
Sakshi Education
బెల్జియం, ఇంగ్లండ్‌లలో జరిగే మహిళల ప్రొ హాకీ లీగ్‌లో బరిలోకి దిగే భారత జట్టును ప్రకటించారు.
ఇన్ని రోజులు కెప్టెన్‌గా వ్యవహరించిన గోల్‌కీపర్ సవితా పూనియాను సారథ్య బాధ్యతల నుంచి తప్పించారు. సవిత స్థానంలో కొత్త కెప్టెన్‌గా జార్ఖండ్‌కు చెందిన 22 ఏళ్ల సలీమా టెటెను నియమించారు. కొత్త వైస్ కెప్టెన్‌గా ఫార్వర్డ్ నవ్‌నీత్ కౌర్‌ను ఎంపిక చేశారు. చీఫ్ కోచ్‌గా హరేంద్ర సింగ్ వ్యవహరిస్తారు.
భారత హాకీ జట్టు: సలీమా టెటె (కెప్టెన్), నవ్‌నీత్ కౌర్ (వైస్ కెప్టెన్), సవితా పూనియా, బిచ్చూదేవి (గోల్‌కీపర్లు), నిక్కీ ప్రధాన్, ఉదిత, ఇషిక, మోనిక, జ్యోతి ఛత్రి, మహిమ, వైష్ణవి ఫాల్కే, నేహా, జ్యోతి, బల్జీత్ కౌర్, మనీషా చౌహాన్, లాల్‌రెమ్‌సియామి, ముంతాజ్ ఖాన్, సంగీత, దీపిక, షర్మిలా దేవి, ప్రీతి దూబే, వందన కటారియా, సునెలితా టొప్పో, దీపిక సోరెంగ్.
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌కు సిద్ధంగా ఉన్న ఏడుగురు భారత షట్లర్లు వీరే..
Published date : 03 May 2024 03:15PM