Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు.. ఎందుకంటే..
ఈ ఘటనతో పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ అనుకూల నిరసనకారుల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించారు. వారు టెంట్‌లను తొలగించి నిరసనకారులను చెదరగొట్టారు. దీనితో 1000 మందికిపైగా నిరసనకారులు పోలీసులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ‘జరిగింది చాలు శాంతించండి’ అని విశ్వవిద్యాలయ చాన్స్‌లర్ జీన్ బ్లాక్ విజ్ఞప్తి చేశారు. డార్ట్‌మౌత్ కాలేజీలో టెంట్లు కూల్చేసి 90 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
డార్ట్‌మౌత్ కాలేజీలో కూడా పోలీసులు టెంట్‌లను తొలగించి 90 మందిని అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 17న కొలంబియాలో ప్రారంభమైన ఈ పాలస్తీనా అనుకూల నిరసనలలో అమెరికావ్యాప్తంగా 30 విద్యాసంస్థలలో 2,000 మందికిపైగా అరెస్ట్ అయ్యారని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.
India Military: ప్రపంచ సైనిక వ్యయంలో భారత్ నాల్గవ స్థానం.. టాప్ 10 దేశాలు ఇవే..
"అసమ్మతి ప్రజాస్వామ్యానికి కీలకం. అయితే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే స్థాయికి అసమ్మతి పెరగిపోకూడదు" అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. బ్రిటన్, ఫ్రాన్స్, లెబనాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో కూడా ఈ నిరసనలు చోటుచేసుకున్నాయి.