Justice DY Chandrachud: సుప్రీంకోర్టు న్యూస్ లెటర్ ప్రారంభం
Sakshi Education
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం నెలవారీ న్యూస్ లెటర్‌ను నవంబర్ 17న ప్రారంభిం చింది.
సుప్రీంకోర్టు ప్రస్తుత కార్యకలాపాలు, పురోగతితోపాటు పనితీరుపై సమీక్ష ఇందులో ఉంటాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మొదటి న్యూస్ లెటర్ను ప్రారంభిం చారు. న్యాయస్థానం చరిత్ర, కీలక తీర్పులపై సమీక్ష, గొప్ప వ్యక్తుల కృషిని తెలిపే కథనాలు ఇందులో ఉంటాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
చదవండి: GK : తొలిసారిగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన రాష్ట్రపతి ఎవరు..?
సుప్రీంకోర్టులో కార్యకలాపాలు, పనితీరుపై అవగాహనకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కోర్టు తీరును మెరుగుపరచడానికి సాగుతున్న నిరంతర ప్రయత్నాలను ఇది పాఠకులకు తెలియజేయడంలో సహాయ పడుతుందని ఆయన చెప్పారు. న్యూస్ లెటర్ ప్రచురణలో కీలక సేవలందించిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్, జడ్జిల లైబ్రరీ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Published date : 18 Nov 2023 11:49AM