Supreme Court Order: 30 వారాల గర్భవిచ్ఛిత్తికి సుప్రీంకోర్టు అనుమతి
సాక్షి ఎడ్యుకేషన్: లైంగిక దాడికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలికకు సర్వోన్నత న్యాయస్థానం ఉపశమనం కల్పించింది. ఆమె 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా తొలగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. చట్ట ప్రకారం–24 వారాల గర్భవిచ్ఛిత్తికి మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ ప్రస్తుత కేసులోని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, రాజ్యాంగంలోని అధికరణ 142 ప్రకారం–ప్రత్యేక అధికారాలను వినియోగించి సుప్రీంకోర్టు తాజా తీర్పు వెలువరించింది. మైనర్ బాలిక సంక్షేమమే అతి ముఖ్యమైందని స్పష్టం చేసింది. మహారాష్ట్రకు చెందిన 14 ఏళ్ల బాలిక లైంగికదాడికి గురై గర్భం దాల్చింది.
CPD Meeting: భారత్ నుంచి ముగ్గురు ప్రజాప్రతినిధులకే ఈ ఆహ్వానం..!
ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఆమె తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తన కుమార్తె 26 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. కోర్టు అందుకు నిరాకరించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాంబే హైకోర్టు తీర్పును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.. బాలికకు గర్భస్రావం చేయడానికి తక్షణమే వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ముంబైలోని లోకమాన్య తిలక్ మునిసిపల్ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్ డీన్‌ను ఆదేశించింది.
HCL To Train Employees In Generative AI: జనరేటివ్‌ఏఐ విభాగంలో 75వేల మంది ఐటీ ఉద్యోగులకు ట్రైనింగ్