Production in Industries: ఆర్థిక సంవత్సరానికి పరిశ్రమల్లో పెరిగిన ఉత్పత్తి శాతం!
సాక్షి ఎడ్యుకేషన్: 2023–24 ఆర్థిక సంవత్సరానికిగానూ పరిశ్రమల్లో ఉత్పత్తి 5.8 శాతం పెరిగినట్లు ప్రభుత్వానికి చెందిన నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(ఎన్‌ఎస్‌ఓ) డేటా వెల్లడించింది. ఒక్క మార్చి నెలలోనే ఏకంగా 4.9 శాతం ఉత్పత్తి పెరిగిందని.. గతేడాది అదే సమయానికి కేవలం 1.9 శాతంగానే ఉత్పత్తి జరిగినట్లు తేలింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 5.2 శాతం ఉత్పత్తి జరగ్గా..
WASP-193: కాటన్ కాండీలాంటి మెత్తటి గ్రహాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు..
2023–24 ఆర్థిక సంవత్సరంలో 0.6 శాతం ఉత్పత్తి పెరగడంపై పారిశ్రామిక వేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మైనింగ్ ఉత్పత్తులు 1.2 శాతం, విద్యుత్తు ఉత్పత్తులు 8.6 శాతం పెరిగాయి. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ)లో గత ఆర్థిక సంవత్సరంలో 5.2 వృద్ధి శాతం నమోదు చేయగా.. 2023 24లో అత్యధికంగా 5.8 వృద్ధి నమోదైంది.